ETV Bharat / sports

ఆ షాట్​ కొట్టి ఔటైతే చాలా బాధగా ఉంటుంది: కోహ్లీ - kohli latest news

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ.. తాను చిన్నతనంలో ఆడిన గల్లీ క్రికెట్​ను గుర్తుచేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Sep 20, 2022, 10:03 PM IST

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ గల్లీ క్రికెట్‌ పాఠాలు నేర్పుతున్నాడు. దిల్లీలో పుట్టిపెరిగిన తాను.. చిన్నతనంలో స్నేహితులతో కలిసి వీధుల్లో క్రికెట్‌ ఆడేవాడినని తెలిపాడు. ఆ రోజులను మరోసారి గుర్తుచేసుకున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇదివరకు బేబీ ఓవర్‌, ట్రయల్‌ బాల్‌, బట్టా వంటి పదాలకు అర్థం చెప్పిన కోహ్లీ తాజాగా మరో కొత్త పదం గురించి వివరించాడు. అదే 'లప్పా షాట్‌'. ఈ షాట్‌ గురించి చెప్తూ నవ్వులు చిందించాడు. "ఇలాంటి షాట్లు మేము చాలా ఆడేవాళ్లం. బ్యాటింగ్‌ తెలియని వారు ఇలా ఆడతారు. ఈ ఒక్క షాటే తెలిసిన ఆటగాళ్లు మాలో చాలామందే ఉండేవారు. ఇది మిడ్‌ వికెట్‌ పైనుంచి కొట్టే స్లాగ్‌ షాట్‌ లాంటిది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా ఇలా ఆడితే నాకే కాదు టీమ్‌ అందరికీ బాధగా అనిపిస్తుంటుంది. సరైన క్రికెట్‌ షాట్లతో ఔట్‌ అయితే ఫరవాలేదు. కానీ ఇలాంటి లప్పా షాట్లు కొట్టి ఔటై బయటకు వెళ్లిపోతుంటారు" అని తెలిపాడు.

ఇదీ చూడండి: ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్​.. కీర్తిసురేశ్​కు బెస్ట్​ ఫ్రెండ్​.. ఎవరో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.