ETV Bharat / sports

పొలార్డ్​పై ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన విండీస్ బోర్డు - వెస్టిండీస్ భారత్ పర్యటన

Kieron Pollard News: భారత్​- వెస్టిండీస్​ సిరీస్​ నేపథ్యంలో విండీస్ కెప్టెన్ కీరన్​ పొలార్డ్​పై సంచలన ఆరోపణలు వచ్చాయి. జట్టులో కెప్టెన్​కు ఆటగాళ్లకు మధ్య వివాదం చెలరేగుతోందని వార్తలు విస్తృతమయ్యాయి. దీనిపై స్పందించింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు.

pollard
పొలార్డ్
author img

By

Published : Jan 28, 2022, 3:45 PM IST

Kieron Pollard News: టీమ్​ఇండియాతో వన్డే, టీ20 సిరీస్​ నేపథ్యంలో త్వరలోనే భారత్​ పర్యటించనుంది వెస్టిండీస్ జట్టు. ఈ మేరకు వన్డే జట్టును కూడా ప్రకటించింది వెస్టిండీస్ బోర్డు. అయితే.. బోర్డు నిర్ణయం అనంతరం.. విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్, సీనియర్​ ఆటగాళ్ల మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు విస్తృతమయ్యాయి. ఆల్​రౌండర్​ ఓడెన్ స్మిత్ విషయంలో పొలార్డ్​ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలిసింది.

కెప్టెన్​ పొలార్డ్​పై వస్తున్న ఆరోపణలపై క్రికెట్ వెస్టిండీస్ అధ్యక్షుడు రిక్కీ స్కెర్రిట్ స్పందించాడు. కీరన్​పై ఒత్తిడి పెంచేందుకు ఇలా చేశారని, ఈ వార్తల్లో నిజంలేదని కొట్టిపారేశాడు. జట్టు సభ్యుల మధ్య ఎలాంటి వివాదం తలెత్తలేదని స్పష్టం చేశాడు.

ప్రస్తుతం విండీస్​ జట్టు తమ సొంతగడ్డపై ఇంగ్లాండ్​తో సిరీస్​ ఆడుతోంది. 5 మ్యాచ్​ల టీ20 సిరీస్​లో 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్ అనంతరం.. భారత్​ పర్యటనలో భాగంగా టీమ్​ఇండియాతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఫిబ్రవరి 6న ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

వచ్చే నెల నుంచి రంజీ మ్యాచ్​లు: బీసీసీఐ

Faisal Ali Dar: బ్రూస్‌లీ, జాకీ చాన్‌ సినిమాలతో ప్రేరణ పొంది.. పద్మశ్రీకి ఎంపికై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.