ETV Bharat / sports

'టీమ్​ ఇండియా నెక్స్ట్​ కోచ్​గా అతడే బెస్ట్​'!

టీమ్ఇండియా తదుపరి కోచ్​ పదవిపై మాజీ క్రికెటర్​ కపిల్​దేవ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్​ సమర్థంగా పనిచేయగలడని పేర్కొన్నాడు. ఇప్పటికే అండర్​-19తో పాటు ఇండియా-ఏ జట్లకు కోచ్​గా ద్రవిడ్ విజయవంతమయ్యాడని తెలిపాడు.

kapil dev, rahul dravid, ravi shastri
కపిల్​దేవ్, రాహుల్ ద్రవిడ్, రవిశాస్త్రి
author img

By

Published : Jul 5, 2021, 10:33 AM IST

Updated : Jul 5, 2021, 11:46 AM IST

టీమ్ఇండియా కోచ్​ పదవిపై మాజీ కెప్టెన్​ కపిల్​దేవ్​ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాబోయే రోజుల్లో భారత జాతీయ జట్టుకు ప్రధాన కోచ్​గా రాహుల్​ ద్రవిడ్​ నియామకమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. అందుకోసమే ప్రస్తుతం శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్​ కోసం ద్రవిడ్​ను కోచ్​గా పంపించారని పేర్కొన్నాడు.

టీమ్ఇండియా కోచ్​గా రవిశాస్త్రి సమర్థంగా పనిచేసినప్పటికీ.. విరాట్ నేతృత్వంలోని జట్టు ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలుచుకోలేకపోయింది. అదే ద్రవిడ్ విషయానికొస్తే.. ఇప్పటికే అండర్​-19తో పాటు ఇండియా-ఏ జట్లకు కోచ్​గా పనిచేశాడు. 2018లో అండర్​-19 ప్రపంచకప్​ను గెలుచుకుంది. దీంతో ప్రస్తుత తరుణంలో తదుపరి కోచ్​గా రవిశాస్త్రి స్థానంలో ద్రవిడ్​ను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలిపాడు. ఇదిలా ఉండగా, రానున్న టీ20 ప్రపంచకప్​తో కోచ్​గా రవిశాస్త్రి పదవీ కాలం ముగియనుంది.

"దీని గురించి(తదుపరి కోచ్​) మాట్లాడాల్సిన అవసరం లేదని అనుకోను. శ్రీలంకతో సిరీస్​ ముగిశాక.. టీమ్ఇండియా ప్రదర్శనపై ఒక అవగాహన వస్తుంది. కోచ్​ను మార్చాల్సి వస్తే అది తప్పులేదు. రవిశాస్త్రి కూడా కోచ్​గా చాలా విజయాలు సాధించాడు. అతన్ని తీసేయాల్సిన అవసరమైతే లేదు. కానీ, మార్పు తప్పదు కదా. కాలానుగుణంగా మార్పులు వస్తాయి."

-కపిల్ దేవ్, టీమ్ఇండియా మాజీ కెప్టెన్.

ప్రస్తుతం టీమ్ఇండియాలో అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారు. ఒకే సమయంలో ఇరు దేశాలలో రెండు వేర్వేరు సిరీస్​లు నిర్వహించేటంతటి సత్తా భారత్ సొంతం. ఈ సిరీస్​లో రాణించిన వారికి తదుపరి జాతీయ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: Mithali Raj: మహిళల క్రికెట్​లో మరో సచిన్​

Last Updated : Jul 5, 2021, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.