ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ట్విట్టర్ వేదికగా వివాదానికి తెరలేపాడు. కివీస్ సారథి కేన్ విలియమ్సన్ ఒకవేళ భారతీయుడైతే.. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా ఉండేవాడని పేర్కొన్నాడు. అప్పుడు విరాట్ కోహ్లీని గొప్ప క్రికెటర్ అని ఏ ఒక్కరూ ఆమోదించకపోయేవారని తెలిపాడు. సామాజిక మాధ్యమాల్లోనూ కోహ్లీని అనుసరించకపోయేవారని అభిప్రాయపడ్డాడు.
"విలియమ్సన్ మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమ ఆటగాడిగా ఉన్నాడు. కాబట్టి అతడిని కోహ్లీతో సరిపోల్చవచ్చు. విరాట్‌లా కేన్‌కు ఇన్‌స్టాలో 100 మిలియన్ల ఫాలోవర్లు లేరు. కోహ్లీకి వచ్చినట్టు వివిధ ప్రకటనల ఏడాదికి 30-40 మిలియన్ డాలర్ల ఆదాయం కేన్‌కు లేదు. క్రికెట్లో స్థిరంగా రాణించగల సత్తా విలియమ్సన్ సొంతం. ఇండియా కెప్టెన్‌తో పోల్చితే పరుగులు సాధించడంలో కివీస్ సారథే ఓ మెట్టు పైనే ఉంటాడు. అని వాన్ పేర్కొన్నాడు."
-మైకేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్.
గత రెండేళ్ల కాలంగా ఇరువురి కెప్టెన్ల గణాంకాలను సరిపోల్చాడు వాన్. టెస్టుల్లో కేన్ నంబర్ వన్ ర్యాంకులో ఉన్నాడని.. అదే విరాట్ ఐదో స్థానంలో ఉన్నాడని పేర్కొన్నాడు. వన్డేల్లో మాత్రం గొప్ప ఆటగాడని వాన్ అభిప్రాయపడ్డాడు.
-
Big statement coming from Michael Vaughan!
— HT Sports (@HTSportsNews) May 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
"If Kane Williamson was Indian, he would be the greatest player in the world."https://t.co/H81qFrf33G
">Big statement coming from Michael Vaughan!
— HT Sports (@HTSportsNews) May 14, 2021
"If Kane Williamson was Indian, he would be the greatest player in the world."https://t.co/H81qFrf33GBig statement coming from Michael Vaughan!
— HT Sports (@HTSportsNews) May 14, 2021
"If Kane Williamson was Indian, he would be the greatest player in the world."https://t.co/H81qFrf33G
ఇదిలా వుండగా.. జూన్ 18 నుంచి భారత్-కివీస్ మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమ్ఇండియా జూన్ 2న ఇంగ్లాండ్ బయల్దేరనుంది.
ఇదీ చదవండి: ఇంగ్లాండ్ పర్యటనకు భారత మహిళల జట్టు ఇదే