ETV Bharat / sports

ఉమ్రాన్‌ మాలిక్‌ టాలెంట్‌పై కేన్‌ కీలక వ్యాఖ్యలు.. నాన్​స్ట్రైకర్ రనౌట్​పై ఏమన్నాడంటే?

author img

By

Published : Nov 15, 2022, 3:48 PM IST

టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ముగిసింది. ఇక ద్వైపాక్షిక సిరీస్‌ల సందడి మొదలు కానుంది. నవంబర్ 18 నుంచి భారత్-కివీస్‌ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పలు కీలక విషయాలపై మాట్లాడాడు.

kane williamson comments on umran mallik
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్

నవంబర్ 18 నుంచి భారత్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే హార్దిక్‌ పాండ్య నాయకత్వంలోని స్క్వాడ్‌ను భారత్‌ ప్రకటించగా.. తాజాగా కివీస్‌ కూడా తన జట్టు సభ్యులను వెల్లడించింది. భారత్‌తో సిరీస్‌ సందర్భంగా న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్ విలియమ్సన్ ఓ ఆంగ్ల ఛానల్‌తో ప్రత్యేకంగా మాట్లాడాడు. టీమ్‌ఇండియా ఆటగాడు ఉమ్రాన్‌ మాలిక్‌ జట్టులోకి రావడం, టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే భారత్‌తో సిరీస్‌లు, నాన్‌స్ట్రైకర్‌ రనౌట్‌.. కొన్ని విషయాల మీద తన స్పందన తెలిపాడు. నవంబర్ 18న తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది.

నాన్‌స్ట్రైకర్‌ రనౌట్‌పై..

.

"ఇలాంటి విషయాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా మంది మాట్లాడేశారు. అయితే వ్యక్తిగతంగా మాత్రం ఆటకు ఇదేమంత ఆకర్షణీయంగా ఉంటుందని అనుకోవడం లేదు. పోటీ పడేటప్పుడు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాగని కాస్త ముందుగా క్రీజ్‌ను వదిలి ప్రయోజనం పొందాలని చూస్తారని భావించడం లేదు. అభిమానులు ఎక్కువగా బ్యాట్‌, బంతికి మధ్య పోరును చూడటానికే ఇష్టపడతారు"

టీ20 ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌ సందర్భంగా గ్లెన్‌ ఫిలిప్‌ నాన్‌స్ట్రైకింగ్‌లో ఉండి స్ప్రింటర్ మాదిరిగా పరిగెత్తేందుకు సిద్ధంగా ఉన్న వీడియో వైరల్‌గా మారింది. దానిపై కేన్‌ స్పందిస్తూ.. "ఆ సంఘటన గురించి నేను మాట్లాడకూడదు. ఎందుకంటే అక్కడ ఉంది గ్లెన్‌ ఫిలిప్. అతడు క్రీజ్‌లో చాలా వేగంగా ఉంటాడు.

అందుకే స్ప్రింటర్‌లా పరుగు కోసం ప్రయత్నిస్తే అదనంగా ప్రయోజనం ఉండొచ్చని అతడు భావించి ఉంటాడు. క్రీజ్‌లో చివరికి ఉండి తన బ్యాట్‌ను గీతకు ఇవతల ఉంచి పరుగు కోసం సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి డిఫరెంట్‌ థియరీలు కొన్ని ఉన్నాయి"

ఉమ్రాన్ మాలిక్‌పై..

ఉమ్రాన్​ మాలిక్​

"దాదాపు 150 కి.మీ వేగంతో బంతులను సంధించే ఉమ్రాన్‌ మాలిక్‌ చాలా టాలెంటెడ్‌. ప్రపంచ క్రికెట్‌లో ఇలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని.. నేర్చుకుంటూ మరింత ఎదగాలి. భారత టీ20 లీగ్‌లో అదరగొట్టాడు. ఆ అనుభవం కచ్చితంగా అతడికి దోహదం చేస్తుంది"అని కేన్ విలియమ్సన్ వెల్లడించాడు. టీ20 లీగ్‌లో హైదరాబాద్‌ ఫ్రాంచైజీకి కేన్‌ విలియమ్సన్‌ కెప్టెన్‌ అని తెలిసిందే. ఈ జట్టులోనే ఉమ్రాన్‌ మాలిక్‌ కీలక బౌలర్‌గా మారాడు.

న్యూజిలాండ్‌ జట్టు ఇదే..
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్‌ అలెన్, మైకెల్ బ్రాస్‌వెల్, డేవన్‌ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాచ్‌ హెన్రీ, టామ్‌ లాథమ్, డారిల్‌ మిచెల్‌, ఆడమ్ మిల్నే, గ్లెన్ ఫిలిప్స్‌, జిమ్మీ నీషమ్, మిచెల్‌ సాంట్నర్, టిమ్‌ సౌథీ, బ్లెయిర్ టిక్నర్.

ఇదీ చదవండి:'టీ20, వన్డేలకు వేర్వేరుగా టీమ్​లను రెడీ చేసుకోవాల్సిందే!'

ముంబయి అభిమానులకు షాక్.. కీరన్ పొలార్డ్ రిటైర్మెంట్.. ఇకపై కోచ్​గా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.