ETV Bharat / sports

ఆర్చర్​కు మరో సర్జరీ.. వేసవి వరకు ఆటకు దూరం - జోఫ్రా ఆర్చర్ చికిత్స

Archer Surgery: ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అభిమానులకు నిరాశే మిగిలింది. గాయం నుంచి కోలుకుని త్వరలో మైదానంలో అడుగుపెడతాడనుకున్న ఈ బౌలర్​కు మరోసారి చికిత్స జరిగింది. దీంతో మరికొంతకాలం ఇతడు బరిలో దిగే అవకాశం లేదని బోర్డు తెలిపింది.

Jofra Archer surgery, Jofra Archer Ruled Out Until England Next summer, జోఫ్రా ఆర్చర్ రెండో సర్జరీ, జోఫ్రా ఆర్చర్ ఆటకు దూరం
Jofra Archer
author img

By

Published : Dec 22, 2021, 1:12 PM IST

Archer Surgery: జోఫ్రా ఆర్చర్.. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. అనతి కాలంలోనే ఇంగ్లాండ్ జట్టులో స్టార్ పేసర్​గా ఎదిగాడు. నిప్పులుచెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టిన ఇతడు.. గాయం కారణంగా కొంతకాలంగా క్రికెట్​కు దూరంగా ఉంటున్నాడు. కానీ త్వరలోనే ఇతడు మైదానంలో అడుగుపెడతాడని భావించిన అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. ఇతడి గాయం గురించి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆసక్తికర విషయం వెల్లడించింది.

"డిసెంబర్ 11న లండన్​లోని ఓ ఆస్పత్రిలో ఆర్చర్​కు రెండోసారి చికిత్స జరిగింది. చాలాకాలంగా అతడిని వేధిస్తున్న మోచేయి సర్జరీ విజయవంతంగా పూర్తయింది. అతడు కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల వింటర్ సీజన్​లో అతడు మైదానంలో బరిలో దిగే అవకాశం లేదు" అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో టీమ్ఇండియాతో జరిగిన ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో చివరిసారిగా పాల్గొన్నాడు ఆర్చర్. ఈ సిరీస్​లో 7.75 ఎకానమీతో 7 వికెట్లు దక్కించుకున్నాడు. తర్వాత గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. దీంతో భారత్​తో పాటు యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్-2021 సీజన్​లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. రెండోసారి చికిత్స చేసుకున్న కారణంగా ప్రస్తుత యాషెస్​తో పాటు త్వరలో ప్రారంభంకానున్న వెస్టిండీస్​ పర్యటనకు దూరమయ్యాడు.

ఇవీ చూడండి: అతడే బెస్ట్ కెప్టెన్.. బాబర్ కాదు: షాహీన్ కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.