ఇంగ్లాండ్లో ఆరంభం కాబోతున్న 'ది హండ్రెడ్' క్రికెట్ టోర్నీలో భారత్ నుంచి మరో మహిళా క్రికెటర్‌కు అవకాశం లభించింది. యువ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్జ్ ఈ టోర్నీలో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ తరఫున బరిలో దిగనుంది. ఇప్పటికే హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ ఈ టోర్నీలో ఆడేందుకు ఒప్పందం చేసుకున్నారు.
ఇంగ్లాండ్లో టెస్టు మ్యాచ్ ఆడనున్న భారత జట్టులో రోడ్రిగ్స్ కూడా ఎంపికైంది. ప్రస్తుతం ఆమె ముంబయిలో 14 రోజుల క్యారంటైన్లో ఉంది. గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన హండ్రెడ్ టోర్నీ జులై 21న లండన్‌లో ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి 'ది హండ్రెడ్' లీగ్‌లో మరో భారత క్రికెటర్!