Jasprit Bumrah IPL 2024 : 2024 ఏడాదికి గానూ ఐపీఎల్ వేలం మరికొద్ది రోజుల్లో మొదలవుతుందన్న తరుణంలో.. ఇటీవలే జరుగుతున్న ప్లేయర్ల ట్రేడింగ్‌లు పలు కాంట్రవర్సీలకు దారి తీస్తోంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు తమ టీమ్‌లోని ప్లేయర్లను వేరే జట్టుకు పంపించారు. అయితే తాజాగా హార్దిక్‌ను ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ తీసుకుంది. చాలా సన్పెన్స్ నడుమ ఎట్టకేలకు హార్దిక్ ముంబయి గూటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో మరో వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. దీంతో ముంబయి ఫ్రాంచైజీపై పాండ్య సహచరులు మనస్తాపానికి గురయ్యారని వార్తలు వస్తున్నాయి. తాజాగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పెట్టిన ఓ పోస్ట్.. ఈ చర్చలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
"కొన్నిసార్లు మౌనమే ఉత్తమ సమాధానం" అని బుమ్రా ఇన్‌స్టా వేదికగా ఓ స్టోరీని పోస్ట్ చేశాడు. అంతే కాకుండా సోషల్ మీడియాలో ముంబయి ఇండియన్స్ జట్టు ఖాతాను అన్‌ఫాలో చేశాడు. దీంతో ఫ్యాన్స్‌లో అనుమానం మొదలైంది. బుమ్రా ఇక ఆ జట్టును వీడనున్నాడన్న రూమర్స్ కూడా తెగ ట్రెండ్ అవుతున్నాయి.
-
Jasprit Bumrah unfollowed Mumbai Indians after the cryptic story pic.twitter.com/Rdwgt9qbXz
— Div🦁 (@div_yumm) November 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Jasprit Bumrah unfollowed Mumbai Indians after the cryptic story pic.twitter.com/Rdwgt9qbXz
— Div🦁 (@div_yumm) November 28, 2023Jasprit Bumrah unfollowed Mumbai Indians after the cryptic story pic.twitter.com/Rdwgt9qbXz
— Div🦁 (@div_yumm) November 28, 2023
బుమ్రా వర్సెస్ హార్దిక్..
క్రీడా వర్గాల సమాచారం ప్రకారం.. హార్దిక్ ముంబయికి తిరిగి రావడం బుమ్రాకు పెద్ద నష్టంగా మారింది. ఎందుకంటే రోహిత్ తర్వాత ఆ జట్టుకు బుమ్రా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే, పాండ్య ఈ స్థానంలో పోటీదారుగా మారాడు. అంతే కాకుండా హార్దిక్‌ను సారథిగా రంగంలోకి దింపేందుకు ముంబయి ఇండియన్స్ దృష్టి సారిస్తోందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఐపీఎల్ 2024లో హార్దిక్ కెప్టెన్‌గా ఉంటాడా లేదా అనే విషయంపై ఎటువంటి క్లారిటీ లేదు.
ఆ జట్టు వైపుకు అడుగులు..
మరోవైపు బుమ్రా పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ముంబయి ఇండియన్స్‌ను అన్‌ఫాలో చేసిన బుమ్రా.. ఆర్సీబీని ఫాలో అవుతున్నాడంటూ మరికొన్ని పేజీల్లో వార్తలు వస్తున్నాయి. బెంగళూరు ఫ్రాంఛైజీతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాడంటూ రూమర్స్ కూడా మొదలయ్యాయి. ఇక చెన్నై సూపర్‌కింగ్స్‌తో కూడా జట్టుకట్టే అవకాశంఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ విషయంపై బుమ్రా స్పందిస్తే కానీ అసలు విషయం బయటపడదు.
గుజరాత్‌కు ఇక సెలవు - ముంబయి గూటికి హార్దిక్ - డీల్ ఎలా కుదిరిందంటే?
అలా జరిగితే ముంబయికి గోల్డెన్ ఛాన్స్- అంతా హార్దిక్ నిర్ణయంపైనే! : అశ్విన్