ETV Bharat / sports

పాక్​లో టీమ్​ఇండియా పర్యటన.. భారత విదేశాంగ శాఖ మంత్రి ఏమన్నారంటే?

పాకిస్థాన్​లో టీమ్​ఇండియా పర్యటించే విషయమై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జై శంకర్‌ స్పందించారు. ఏం అన్నారంటే..

Jaishankar reacts on teamindia pakisthan cricket
పాక్​లో టీమ్​ఇండియా పర్యటన.. భారత విదేశాంగ శాఖ మంత్రి ఏమన్నారంటే?
author img

By

Published : Dec 10, 2022, 3:10 PM IST

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఆసియా కప్‌పై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పాక్‌లో భారత్‌ పర్యటించేది లేదని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పిన నేపథ్యంలో.. ఇరు దేశాల బోర్డుల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జై శంకర్‌ కూడా స్పందించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించేవరకూ భారత్‌-పాక్‌ మధ్య ఎలాంటి క్రికెట్‌ సంబంధాలు ఉండబోవని స్పష్టం చేశారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన చర్చా వేదికలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"టోర్నమెంట్లు వస్తూనే ఉంటాయి.. అయితే ప్రభుత్వ విధానాలు, వైఖరి ఏంటో మీరు తెలుసుకోవాలి. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇదో క్లిష్టమైన సమస్య. మీ తలపై గన్‌ పెడితే.. మీరు నాతో మాట్లాడుతారా?. మీ పొరుగువారు బహిరంగంగా ఉగ్రవాదానికి సహాయం అందిస్తుంటే.. అక్కడ నాయకులు ఎవరు? క్యాంపులు ఎక్కడ ఉన్నాయనే దానిలో రహస్యమేముంటుంది. సీమాంతర ఉగ్రవాదమనేది సాధారణ విషయమని మనం ఎప్పుడూ అనుకోకూడదు. పొరుగు దేశాలపైనే ఉగ్రవాదుల్ని ప్రోత్సహించే ఘటనలు ప్రపంచంలో మరెక్కడైనా ఉన్నాయా? అలాంటిది ఎక్కడా లేదు.. కాబట్టి ఇది అత్యంత అసాధారణమైనది" అని జై శంకర్‌ అన్నారు.

ఇక క్రికెట్‌ గురించి మాట్లాడుతూ.. "క్రికెట్‌ విషయంలో మా వైఖరేంటో మీకు తెలుసు. ఉగ్రవాదాన్ని ఓ దేశం ప్రోత్సహిస్తుంటే దాన్ని మనం అంగీకరించకూడదు. మేం దీనిపై చర్యలు తీసుకోకపోతే.. ఇది అలాగే కొనసాగుతుంది. కాబట్టి పాక్‌పై ప్రపంచ ఒత్తిడి ఉండాలి. ఉగ్రదాడుల బాధితులు తమ స్వరం వినిపించకపోతే.. పాక్‌పై ఆ ఒత్తిడి రాదు. ఆ దేశంపై ఒత్తిడి తీసుకువచ్చే విషయంలో మేం నాయకత్వం వహిస్తాం. ఎందుకంటే ఉగ్రవాదం వల్ల మనం ఎంతగానో నష్టపోయాం" అని జైశంకర్‌ అన్నారు.

జై శంకర్‌ తాజా వ్యాఖ్యలను పరిశీలిస్తే.. బీసీసీఐ, భారత ప్రభుత్వం ఈ విషయంలో ఒకే వైఖరితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది పాక్‌లో భారత్‌ పర్యటించడం సాధ్యం కాకపోవచ్చు. ఇక వచ్చే ఆసియాకప్‌లో భారత్‌ పాక్‌లో పర్యటించకపోతే.. తాము కూడా భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌ టూర్‌కు రాబోమని పీసీబీ చీఫ్‌ రమీజ్‌ రజా ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి: ఇషాన్ కిషన్​ డబుల్​ సెంచరీతో వీరవిహారం.. శతకంతో మెరిసిన కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.