Jadeja wife Court summons: టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రీవాబాకు, ఆమె తల్లికి జామ్‌నగర్ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. 2018లో రోడ్డు యాక్సిడెంట్ సందర్భంగా పోలీసు కానిస్టేబుల్ దాడి కేసులో ఈ మేరకు సమన్లను జారీ అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి వారికి ఇదే ఆఖరి సమన్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆ కేసులో ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. దీంతో రాజ్‌కోట్ పోలీసులు కోర్టు సమన్లను జడేజా సతీమణికి మరోసారి పంపారు.
ఏం జరిగిందంటే..?
జామ్‌నగర్‌లోని సరు సెక్షన్ రోడ్డులో 2018లో రివాబా కారు కానిస్టేబుల్ అహిర్ మోటార్‌సైకిల్ సహా మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో బాధితులకు స్వల్ప గాయాలు కాగా.. సదరు కానిస్టేబుల్ జడేజా సతీమణిపై పాశవికంగా దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. కేసుకు సంబంధించి రీవాబాకు అన్ని రకాలుగా సహకరిస్తున్నామని, దాడికి దిగిన కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అప్పుడు ఎస్పీ తెలిపారు. రీవా ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కానిస్టేబుల్ అహిర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కొద్ది
రోజులకే అహిర్‌కు బెయిల్ మంజూరైంది.
ఇదీ చూడండి: ఈ ఫుట్‌బాలర్ కిల్లింగ్ పోజులు చూస్తే కిక్కో కిక్కు..