టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్ట్ పుజారాకు (Pujara News) క్షమాపణలు చెప్పాడు సోమర్సెట్ బౌలర్ జాక్ బ్రూక్స్ (Jack Brooks). పుజారా యార్క్‌షైర్‌లో ఆడే సమయంలో అతడికి 'స్టీవ్' అనే పేరును పెట్టినందుకు చింతిస్తున్నట్లు తెలిపాడు(Jack Brooks Pujara). 2012లో తాను చేసిన జాత్యహంకార ట్వీట్లపైనా కూడా మన్నించాలని కోరాడు.
స్టీవ్ అనే పదాన్ని పని వాడు అనే అర్థంలో వినియోగించేవారట! ఆసియా సంతతికి చెందిన రెస్టారెంట్ వర్కర్లు, డ్రైవర్లను ఈ పేరుతో పిలిచేవారని తెలిసింది.
"పలకడానికి కష్టంగా ఉండేవారి పేర్లకు బదులు.. 'స్టీవ్' అని పిలిచే వాళ్లం. పుజారాను అలాగే పిలిచా. అలా చేయడం అమర్యాదకరం. తప్పు కూడా. ఇప్పుడా విషయంలో పుజారాను క్షమాపణ కోరుతున్నా. 2012లోనూ వివక్షపూరితమైన ట్వీట్లు చేశాను. అది తప్పని తెలుసుకున్నా. నా ట్వీట్లు చూసిన ప్రతిఒక్కరికీ కూడా క్షమాపణలు చెబుతున్నాను."
-జాక్ బ్రూక్స్, ఇంగ్లీష్ క్రికెటర్
కొద్దిరోజుల క్రితం యార్క్‌షైర్ క్రికెట్ కౌంటీ క్లబ్‌పై ఇంగ్లాండ్ క్రికెటర్ అజీమ్ రఫిక్ దాఖలు చేసిన ఫిర్యాదుపై అక్కడి కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే జాక్ బ్రూక్స్ పూజారాకు క్షమాపణలు చెప్పాడు.
ఇదీ చూడండి: Racism in Cricket: మోకాళ్లపై సంఘీభావం తెలిపితే సరిపోదు!