టీమ్ఇండియా యువ వికెట్‌కీపర్ ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. తన తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో విజృంభించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో.. కేవలం 33బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తిచేసుకున్నాడు.
ధనాధన్..
పృథ్వీ షా ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్.. ఒక్క సెకండ్‌ను కూడా వృథా చేయలేదు. తొలి బంతిని సిక్సర్‌గా మలిచాడు ఈ ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్. ఇక ఆ తర్వాతి బంతికి ఫోర్ కొట్టాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో మైదానం అన్ని వైపులా పరుగులు రాబట్టాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో ఇషాన్ బౌండరీలు బాదుతుంటే లంక ఆటగాళ్లు చూస్తూ ఉండిపోవడం తప్ప ఏం చేయలేకపోయారు.
సహజంగా.. ఎవరైనా తొలి వన్డే ఆడుతుంటే.. కాస్త నెమ్మదిగా, ఆచితూచి బ్యాటింగ్ చేస్తారు. కానీ ఇషాన్ కిషన్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఈ నేపథ్యంలోనే తొలి అర్థశతకాన్ని సిక్సర్‌తో అందుకున్నాడు. ఇషాన్ దూకుడు చూస్తుంటే సెంచరీ ఖాయం అనుకున్న తరుణంలో.. 59పరుగులకు ఔట్ అయ్యాడు.
ఆదివారం ఇషాన్ కిషన్ పుట్టినరోజు కావడం మరో విశేషం!
'ఇషాన్' విశేషాలు..
- టీమ్ఇండియా తరఫున అరంగేట్ర టీ20, వన్డే మ్యాచుల్లో అర్ధశతకం సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు ఇషాన్. తొలుత ఈ ఘనతను రాబిన్ ఉతప్ప సాధించాడు.
- అరంగేట్ర వన్డే మ్యాచ్‌లో.. అతితక్కువ బంతుల్లో 50 పరుగులు చేసిన ఆటగాళ్లల్లో ఇషాన్ రెండోస్థానంలో నిలిచాడు. ఇషాన్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. ఈ ఏడాది ఇంగ్లాండ్‌పై కృనాల్ పాండ్యా కేవలం 26 బంతుల్లోనే ఆర్ధశతం చేశాడు.
ఇదీ చూడండి:- IND vs SL: రాణించిన లంక బ్యాట్స్‌మెన్.. భారత్ లక్ష్యం 263