టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలై అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది టీమ్ఇండియా. జట్టు ఓటమిపాలవడానికి కారణం కోహ్లీసేన బ్యాటింగ్ ఆర్డర్ అంటూ పలు విమర్శలు వచ్చాయి. ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్‌ను పక్కనపెట్టడం ఏంటని కొందరు ప్రశ్నించారు. తాజాగా ఇదే విషయంపై స్పందించిన వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్(harbhajan singh latest tweet).. ప్రపంచకప్‌లో టీమ్ఇండియా పుంజుకోవాలంటే ఈ బ్యాటింగ్ ఆర్డర్‌ను పరిశీలించాలని సూచించాడు. అదేంటో చూద్దాం.
"ఈ విషయాన్ని నేను చాలా కాలంగా చెబుతున్నా. ఇషాన్ కిషన్‌కు ఆడే అవకాశం ఇవ్వండి. అతడు రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా రావాలి. కోహ్లీ మూడు, రాహుల్ నాలుగు, పంత్ ఐదో స్థానంలో దిగాలి. హార్దిక్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే బాగుంటుంది. పాక్‌పై విఫలమైనా.. అతడు మ్యాచ్ విన్నర్. జడేజా ఏడులో రావాలి. శార్దూల్ ఠాకూర్‌ను 8వ స్థానంలో దించాలి. ఇతడు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ నిరూపించుకున్నాడు. కాబట్టి శార్దూల్‌కు ఓ అవకాశం ఇవ్వాలి. బుమ్రా, షమీ, వరుణ్ చక్రవర్తి చివర్లో రావాలి."
-హర్భజన్, వెటరన్ స్పిన్నర్
పాకిస్థాన్(ind vs pak t20)పై భారత్ ఓటమిపైనా స్పందించాడు హర్భజన్. "పాక్‌పై ఓడిపోవడం జట్టుపై పెద్దగా ప్రభావం చూపదని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది తొలి మ్యాచ్ మాత్రమే. ఇలాంటి టోర్నీలో గొప్ప ఆరంభం లభించాల్సింది. అయినా ఈ ఓటమితో దారులు పూర్తిగా మూసుకుపోలేదు. మన జట్టు బలంగా ఉంది. గొప్పగా పుంజుకుంటారని భావిస్తున్నా. చేసిన తప్పులను సరిదిద్దుకుని తిరిగి గెలుపు ట్రాక్ ఎక్కుతారని అనుకుంటున్నా" అంటూ భారత్‌కు మద్దతుగా నిలిచాడు భజ్జీ.
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ విధించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఓపెనర్లు బాబర్ అజామ్ (68*), రిజ్వాన్ (79*) 17.5 ఓవర్లలో ఛేదించారు.