ETV Bharat / sports

ఉమెన్స్​ టీ20 ఛాలెంజ్​లో ఈసారీ మూడు జట్లే! - బీసీసీఐ

మహిళా టీ20 ఛాలెంజ్​లో ప్రస్తుతానికి మూడు జట్లతోనే టోర్నీ నిర్వహించనున్నట్లు భారత క్రికెట్​ నియంత్రణ మండలి అధికారి ఒకరు స్పష్టం చేశారు. అయితే ఈసారి నాలుగు టీమ్​లతో నిర్వహించాలని భావించినా.. కరోనా సంక్షోభం కారణంగా ఆ నిర్ణయాన్ని పక్కనపెట్టినట్లు అధికారి వెల్లడించాడు.

Women's T20 Challeng
ఉమెన్స్​ టీ20 ఛాలెంజ్​లో ఈసారీ మూడు జట్లే!
author img

By

Published : Apr 12, 2021, 8:36 PM IST

ఉమెన్స్​ టీ20 ఛాలెంజ్​లో ఎప్పటిలాగే మూడు టీమ్​లతో ఈ ఏడాది టోర్నీ కొనసాగించనున్నట్లు భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ) వెల్లడించింది. ఐపీఎల్​ ప్లేఆఫ్స్​ జరిగే సమయంలో ఈ ఛాంపియన్​షిప్​ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రస్తుత సీజన్​లో నాలుగు టీమ్​లతో టోర్నీ నిర్వహించాలనుకున్నా.. కరోనా సంక్షోభం కారణంగా మూడు జట్లతోనే మహిళల టీ20 ఛాలెంజ్​ను జరుపుతామని బోర్డు స్పష్టం చేసింది.

"ప్రస్తుతానికైతే మూడు టీమ్​లతో టోర్నీ నిర్వహించాలని భావిస్తున్నాం. అయితే త్వరలోనే మా నిర్ణయాన్ని వెల్లడిస్తాం. ఈ మ్యాచ్​లన్నీ దిల్లీలోనే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​కు చెందిన స్టార్​ మహిళా క్రికెటర్లతో మాట్లాడిన తర్వాత ఓ నిర్ణయానికి వస్తాం".

- బీసీసీఐ అధికారి

యూఏఈ వేదికగా గతేడాది జరిగిన మహిళల టీ20 ఛాలెంజ్​ జరిగింది. అయితే ప్రస్తుత సీజన్​లో టోర్నీని ఎప్పుడు నిర్వహించాలనే దానిపై మాత్రం ఏప్రిల్​ 16న జరగనున్న అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​ తర్వాత స్పష్టత రానుంది. దీంతో పాటు భారత క్రికెట్​ భవిష్యత్​ కార్యచరణపై కూడా ఓ నిర్ణయం వెలువడనుంది.

ఇదీ చూడండి: టాస్​ గెలిచిన రాజస్థాన్​.. పంజాబ్​ బ్యాటింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.