ETV Bharat / sports

విరాట్​-గంభీర్​ కాంట్రవర్సీ.. మధ్యలో ఈ నవీన్​ ఉల్​ హక్ ఎవరబ్బా?

తాజాగా జరిగిన ఆర్సీబీ లఖ్​నవూ మధ్య జరిగిన మ్యాచ్​ ఇప్పుడు సోషల్​ మీడియాలో సెన్సేషన్​గా మారింది. ఈ మ్యాచ్​కు సంబంధించిన కాంట్రవర్సీ ఒక ఎత్తయితే దానికి కారణమైన వ్యక్తి మరో ఎత్తు. గంభీర్​ విరాట్​ కోహ్లీ వాగ్వాదంతో పాటు ఇప్పుడు నవీన్- విరాట్​ కాంట్రవర్సీ కూడా హాట్​టాపిక్​గా మారింది. ఇంతకీ ఈ నవీన్​ ఎవరంటే..

ముదిరిన విరాట్​ గంభీర్​ కాంట్రవర్సీ.. మధ్యలో ఈ నవీన్​ ఉల్​ హక్ ఎవరబ్బా?

author img

By

Published : May 2, 2023, 1:39 PM IST

ఐపీఎల్‌ 2023 సీజన్​లోని 43వ మ్యాచ్​లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట హాట్​ టాపిక్​గా మారింది. ఎనర్జీ, ఎగ్జైట్మెంట్​ ఇలా అన్ని అంశాలు కలగలిపి ఉండే ఈ ఐపీఎల్​ మ్యాచ్​లో ఇప్పుడు మరోసారి కాంట్రవర్సీ అనే ఓ ఎలిమెంట్​ యాడ్​ అయ్యింది. దీంతో స్టేడియంలో ఒక్కసారిగా నిప్పులు చెలరేగాయి. వాన జల్లుకు కూల్​గా ఉండాల్సిన వాతావరణం ఒక్కసారిగా సెగలు పుట్టించింది. నువ్వా నేనా అంటూ ప్లేయర్లు ఒకరికొకరు వాగ్వాదానికి దిగి అభిమానులకు టెన్షన్ తెప్పించారు. సోమవారం ఆర్సీబీతో లఖ్​నవూకు జరిగిన మ్యాచ్​లో జరిగిన కొన్ని ఘటనలు ఇప్పుడు ఎన్నో వివాదాలకు దారి తీస్తున్నాయి.

స్టేడియంలో విరాట్​-గంభీర్​ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ గొడవకు కారణం మాత్రం మరో వ్యక్తి. అతనే లఖ్​నవూ జట్టుకు చెందిన నవీన్​ ఉల్​ హక్​. ఆఫ్గాన్​స్థాన్​కు చెందిన ఈ పేసర్​ ఇప్పుడు విరాట్​ ఫైట్​తో టాక్​ ఆఫ్​ ద టౌన్​గా నిలిచాడు. అసలు ఎవరు ఈ నవీన్ ఉల్ హక్‌? అసలు ఈ వాగ్వాదం ఎలా మొదలైందంటే..

23 ఏళ్ల నవీన్ ఉల్ హక్‌.. అఫ్గానిస్థాన్​లోని కాబూల్​కు చెందిన ప్లేయర్​. 17 ఏళ్ల వయసులోనే క్రికెట్​లోకి తెరంగేట్రం చేసిన ఈ యంగ్​ ప్లేయర.. అఫ్గాన్​ జట్టు తరఫున 2016లో తన అంతర్జాతీయ వన్డే కెరీర్​ను ప్రారంభించాడు. 2021 తర్వాత వన్డే జట్టుకు దూరమయ్యాడు. మొత్తం తన వన్డే కెరీర్​లో ఏడు మ్యాచ్​లు ఆడిన నవీన్​.. 25.42 ఎకానమీతో 14 వికెట్లను పడగొట్టాడు. వన్డేల్లో 42 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి రికార్డుకెక్కాడు. 2019లో తన అంతర్జాతీయ టీ20 కెరీర్​ను ప్రారంభించిన నవీన్.. టీ20ల్లోనూ మంచి గణాంకాలనే నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు ఈ యంగ్​ ప్లేయర్​ మొత్తం 21 మ్యాచ్​లు ఆడాడు.

ఇక 2023 మార్చిలో జరిగిన టీ20ల్లో పాకిస్థాన్ జట్టు తరఫున ఆడిన ఈ ప్లేయర్.. అంతర్జాతీయ టీ20ల్లో 19.46 సగటుతో 28 వికెట్లు పడగొట్టాడు. అతని టీ20 కెరీర్లో 3/21 బెస్ట్‌ స్పెల్​గా నిలిచింది. కాగా ఇతనికి టీ20 లీగుల్లో మంచి అనుభవమే ఉంది. క్వెట్టా గ్లాడిఏటర్స్, షార్జా వారియర్స్, సిడ్నీ సిక్సర్స్‌, లెయిస్టర్‌ షైర్‌ గుయానా అమెజాన్ వారియర్స్.. లాంటి జట్ల తరఫున టీ20 లీగ్స్​లోనూ ఆడాడు. ఇంకా ఈ ఐపీఎల్ సీజన్​లో లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌ జట్టులో ఆడుతున్నాడు.

అయితే సోమవారం జరిగిన మ్యాచ్​లో విరాట్​తో వాగ్వాదానికి దిగిన ఈ ప్లేయర్​ ఆ తర్వాత కూడా కోహ్లీతో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆర్సీబీ అభిమానులు అతన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. నెటిజన్లు సైతం ఈ అఫ్గాన్​ ప్లేయర్​ను తెగ ట్రోల్​ చేస్తున్నారు. ప్రవర్తనా నియామావళిని ఉల్లంఘించి స్టేడియంలో వాగ్వాదానికి దిగినందున ఐపీఎల్​ యాజమాన్యం అతనికి మ్యాచ్​ ఫీజ్​లో 50 శాతం జరిమానా విధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.