ETV Bharat / sports

IPL play off race : గుజరాత్‌ ఎంట్రీ ఇచ్చేసింది.. మరి మిగతా మూడు టీమ్స్​ ఏంటి? - ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్ రేసు దిల్లీ క్యాపిటల్స్​

IPL 2023 Play off Race : ఐపీఎల్‌ 2023లో ప్లేఆఫ్స్‌ రేసు ఆసక్తిగా కొనసాగుతోంది. గుజరాత్‌ టైటాన్స్‌ అధికారికంగా ప్లేఆఫ్స్‌లోకి చేరిన ఫస్ట్ టీమ్​గా నిలిచింది. మరి మిగతా మూడు స్థానాల్లో నిలిచేందుకు ఆయా టీమ్స్​కు ఉన్న అవకాశాలను పరిశీలిద్దాం..

IPL play off race
IPL play off race
author img

By

Published : May 16, 2023, 1:53 PM IST

IPL 2023 Play off Race : ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ 2023వ సీజన్​ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఆయా జట్ల మధ్య ప్లేఆఫ్స్‌ బెర్త్​ రేసు ఉత్కంఠగా కొనసాగుతోంది. ఏ జట్లు ప్లేఆఫ్స్​కు చేరనున్నాయి? ఏ జట్లు పోటీపడనున్నాయి? అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ ప్రియులు. ఈ నేపథ్యంలో ప్రతి మ్యాచూ, ప్రతి పాయింటూ కీలకం అవ్వడం వల్ల.. కేవలం విజయాలపైనే కాకుండా నెట్‌ రన్‌రేట్‌పై కూడా ఆయా జట్లు ఫుల్ ఫోకస్ పెడుతున్నాయి. దాదాపు అన్ని టీమ్స్​ కూడా ఇంకా ఒకటో రెండో మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. అయితే తాజాగా సోమవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్​పై విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న గుజరాత్‌ టైటాన్స్​.. 18 పాయింట్లతో అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరిపోయింది. ఈ సీజన్​లో ప్లేఆఫ్స్​కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. మరి ఈ ప్లేఆఫ్స్‌కు చేరే ఛాన్స్​ ఉన్న మిగతా జట్లను ఓ సారి పరిశీలిద్దాం..

మొత్తం పది జట్లు ఆడే ఈ ఐపీఎల్‌ సీజన్​లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు మాట్రమే ప్లేఆఫ్స్‌ చేరుకుంటాయన్న సంగతి దాదాపు క్రికెట్ ప్రియులందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఫస్ట్​ రెండు స్థానాలు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇక్కడ ఓడిన జట్టుకు మరో ఛాన్స్​ ఉంటుంది. దీంతో ప్లేఆఫ్స్‌ కోసం పోటీపడే జట్లు టాప్‌-2లో ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటాయి.

Gujarat Titans Play Offs Race : ఈ సీజన్‌లోనూ అద్భుత ప్రదర్శన చేస్తూ ప్లేఆఫ్స్‌లో చేరిన తొలి జట్టుగా నిలిచింది గుజరాత్​. పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో ఉన్న ఈ జట్టు.. ఆడాల్సింది ఇంకో మ్యాచ్‌ మాత్రమే ఉంది. ఈ చివరి మ్యాచ్‌లోనూ బెంగళూరుపై గెలిస్తే.. ముంబయి ఇండియన్స్​ ఆడే మ్యాచ్‌ల రిజల్ట్​తో సంబంధం లేకుండా ఫస్ట్ ప్లేస్​లో కొనసాగుతుంది.

Chennai Super Kings Play Offs Race : ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌.. ఆదివారం కోల్‌కతాపై ఓడిపోవడంతో కాస్త ఎఫెక్ట్ పడింది. దీంతో పాయింట్ల టేబుల్​లో టాప్‌ రెండు స్థానాల్లో నిలిచే అవకాశాలు తగ్గాయి. చివరి మ్యాచ్‌లో తమ సొంతమైదానంలో దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది సీఎస్కే. ఆ మ్యాచ్‌లో గెలిస్తే.. ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం అవుతుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఓడితే ఇతర జట్ల రిజల్ట్​పై చెన్నై ప్లే ఆఫ్​ బెర్త్​ ఆధారపడి ఉంటుంది. అప్పుడు, ముంబయి, లఖ్‌నవూ, బెంగళూరుతో గట్టి పోటీ పడాల్సి ఉంటుంది.

Mumbai Indians Play Offs Race : ముంబయి ఇండియన్స్‌.. పాయింట్ల టైబుల్​లో మూడో స్థానాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే.. తన తదుపరి రెండు(లఖ్‌నవూ, సన్‌రైజర్స్‌తో) మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే.. 18 పాయింట్లతో క్వాలిఫయర్‌ 1లోనే ప్లేస్‌ను దక్కించుకునే ఛాన్స్​ ఉంది. ఒకవేళ రెండూ ఓడిపోతే.. టేబుల్​లో కింద ఉన్న ఇతర టీమ్స్​ ముంబయిను దాటేస్తాయి. దీంతో ప్లేఆఫ్స్‌ బెర్త్‌ కోసం ఇతర జట్లతో గట్టిగా పోటీపడాల్సి ఉంటుంది. లేదంటే ఒక్కటి గెలిచినా.. ముంబయికి ఛాన్స్​ ఉంటుంది.

Lucknow Super Giants Play Offs Race : ప్రస్తుతం 13 పాయింట్లతో ఉన్న లఖ్​నవూ.. ఇంకా రెండు (ముంబయి, కోల్‌కతాతో) మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో లఖ్‌నవూ ఓడిపోతే.. ప్లేఆఫ్స్‌ అవకాశాల కోసం ఇతర జట్ల రిజల్స్​పై ఆధారపడాల్సి ఉంటుంది. లేదంటే ఒక్క మ్యాచ్‌లో గెలిచినా.. రాజస్థాన్​, కోల్​కతా ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమిస్తాయి. ఒకవేళ చెన్నై- ముంబయి చివరి మ్యాచ్‌ల్లో ఓడి.. అలాగే లఖ్‌నవూ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తేనే.. 17 పాయింట్లతో టాప్‌ 2లో ఉంటే ఛాన్స్​ ఉంటుంది.

Royal Challengers Bangalore Play Offs Race : ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న ఆర్సీబీ .. ఇంకా రెండు (సన్‌రైజర్స్‌, గుజరాత్‌లతో) మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఆర్సీబీ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తేనే ప్లేఆఫ్స్‌ రేసులో ఉంటుంది. అప్పటికీ కొన్ని సమీకరణాలు అనుకూలించాలి. ముంబయి- లఖ్​నవూ కనీసం ఒక మ్యాచైనా ఓడిపోవాలి. అది కూడా ముంబయి కంటే ఆర్సీబీ రన్​ రేట్​ ఎక్కువగా ఉండాలి. అప్పుడు 16 పాయింట్లతో ప్లేఆఫ్స్​కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఆర్సీబీ ఒక్క మ్యాచ్‌లోనే గెలిస్తే.. 14 పాయింట్లతో ఇతర టీమ్స్​లతో పోటీ పడాల్సి ఉంటుంది. దీనికి కూడా సమీకరణాలు వర్తిస్తాయి.

Punjab Kings Play Offs Race : 12 పాయింట్లతో ఉన్న పంజాబ్‌ కింగ్స్​.. తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో గెలవడంతో పాటు ఇతర జట్ల రిజల్ట్స్​ తనకు కలిసి రావాలి. ఇక పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న సన్​రైజర్స్​, దిల్లీ క్యాపిటల్స్​.. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించాయి. రాజస్థాన్‌, కోల్‌కతా ఒక్కో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఒక వేళ ఈ మ్యాచుల్లో గెలిచినా.. అవి ఇతర జట్ల ప్లే ఆఫ్స్​ ఛాన్స్​లను ప్రభావితం చేస్తాయే కానీ.. ప్లేఆఫ్స్‌లో చేరడం దాదాపు కష్టమనే చెప్పాలి.

ఇదీ చూడండి: భువనేశ్వర్​ కుమార్​ అరుదైన ఘనత.. గెలుపు జోష్​లో ఉన్న గుజరాత్​కు షాక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.