ETV Bharat / sports

వారిని రిలీజ్​ చేయడం చాలా బాధేసింది: రోహిత్​ శర్మ

author img

By

Published : Dec 1, 2021, 8:30 AM IST

Mumbai retention 2021: రోహిత్​ శర్మ, బుమ్రా, సూర్యకుమార్​ యాదవ్​, కీరన్​ పొలార్డ్​ను అట్టిపెట్టుకున్న ముంబయి.. ఇషాన్​ కిషన్​, హార్దిక్​ పాండ్య, కృనాల్​ పాండ్య, ట్రెంట్​ బౌల్ట్​ సహా పలువురు ఆటగాళ్లను రిలీజ్​ చేసింది. దీనిపై స్పందించిన కెప్టెన్​ రోహిత్​.. రిలీజ్​ చేసిన ఆటగాళ్ల పట్ల విచారం వ్యక్తం చేశాడు. వారు జట్టు కోసం ఎంతో శ్రమించారని గుర్తుచేసుకున్నాడు.

ముంబయి ఇండియన్స్​ రిటెన్షన్​, mumbai indians retention
ముంబయి ఇండియన్స్​ రిటెన్షన్​

Mumbai retention players: ఐపీఎల్‌లో అత్యధికంగా ఐదుసార్లు టైటిల్‌ను సొంతం చేసుకున్న జట్టు ముంబయి ఇండియన్స్‌(mumbai indians retention). ఈ సారి రిటెన్షన్​ ప్రక్రియలో సారథి రోహిత్ శర్మతోపాటు ఫాస్ట్‌ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌, కీరన్‌ పొలార్డ్‌ను తన వద్దే ఉంచుకుంది. ఇషాన్​ కిషన్​, హార్దిక్​ పాండ్య, కృనాల్​ పాండ్య, ట్రెంట్​ బౌల్ట్​ సహా పలువురు ఆటగాళ్లను విడుదల చేసింది. కాగా, పాండ్య బ్రదర్స్​ను మెగావేలంలోనూ తీసుకోవడమే అనుమానమే. ఈ నేపథ్యంలో నెటిజన్లు.. హార్దిక్​, ఇషాన్​ను రిటెయిన్​ చేసుకోకపోవడంపై 'వి మిస్​ యూ' అంటూ విపరీతంగా పోస్ట్​లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే రిటెన్షన్ పూర్తైన​ తర్వాత ఈ ప్రక్రియ గురించి సారథి రోహిత్​ మాట్లాడిన ఓ వీడియోను పోస్ట్​ చేసింది ముంబయి. ఇందులో హిట్​మ్యాన్​ మాట్లాడుతూ.. "ఈ ఏడాది ముంబయికి రిటెన్షన్​ ప్రక్రియ చాలా కఠినమైనది. మా దగ్గర ప్రస్తుతం అద్భత ఆటగాళ్లు ఉన్నారు. కొంతమంది ఆటగాళ్లను రిలీజ్​ చేయడం చాలా బాధేసింది. వాళ్లు జట్టు కోసం అద్భుతంగా ఆడారు. ఈ ఫ్రాంచైజీకి ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చారు. ఏదేమైనప్పటికీ మా రిటెయిన్​ ప్లేయర్స్​ సహా మెగా వేలంలో తీసుకునే ఆటగాళ్లతో కలిసి ముంబయి బలమైన జట్టుగా తయారవుతుందని ఆశిస్తున్నాను." అని అన్నాడు.

రిటైన్​ చేసుకున్న నలుగురి కోసం రూ.42 కోట్లను కేటాయించింది ముంబయి(rohithsharma retained price). రోహిత్​కు రూ.16 కోట్లు, బుమ్రా (రూ.12), సూర్యకుమార్‌ యాదవ్‌ (రూ.8 కోట్లు), పొలార్డ్‌(రూ.6 కోట్లు) తీసుకుంది చేసుకుంది. ఇంకా ముంబయి వద్ద రూ.48 కోట్లు ఉంటాయి.

ఇదీ చూడండి: ఐపీఎల్ రిటెన్షన్ పూర్తి జాబితా వచ్చేసింది.. ఎవరికి అత్యధిక ధరంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.