ETV Bharat / sports

'విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేయడమేంటి?'​.. గుజరాత్‌​​పై నెటిజన్ల ఫైర్​ - గుజరాత్​ టైటాన్స్​

Trolls On Vijay Shankar: ఐపీఎల్​ 15వ సీజన్​లో వరుస మ్యాచుల్లో విఫలమవుతోన్న గుజరాత్​ ఆల్​రౌండర్​ విజయ్​శంకర్​పై అభిమానులు మండిపడుతున్నారు. అసలు అతడిని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తూ.. నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్​ చేస్తున్నారు.

vijay-shankar
vijay-shankar
author img

By

Published : Apr 15, 2022, 1:11 PM IST

Trolls On Vijay Shankar: గుజరాత్‌ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్‌ చేస్తున్నారు. అతడిని ఈ టీ20 లీగ్‌కు ఎలా తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. గతరాత్రి రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌గా వచ్చి ఏడు బంతులాడి కేవలం రెండే పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో అతడిని ఎందుకు తీసుకున్నారని అభిమానులు మండిపడుతున్నారు. మరోవైపు గుజరాత్‌ టీమ్‌ ఈ మ్యాచ్‌లో ప్రతిభావంతుడైన సాయి సుదర్శన్‌ను పక్కనపెట్టి విజయ్‌ను ఎంపిక చేయడం వల్ల మరింత రెచ్చిపోతున్నారు.

Trolls On Vijay Shankar
విజయ్​శంకర్​పై ట్రోల్​
Trolls On Vijay Shankar
విజయ్​శంకర్​పై ట్రోల్​
Trolls On Vijay Shankar
విజయ్​శంకర్​పై ట్రోల్​
Trolls On Vijay Shankar
విజయ్​శంకర్​పై ట్రోల్​
Trolls On Vijay Shankar
విజయ్​శంకర్​పై ట్రోల్​

విజయ్‌ కొన్నేళ్లుగా ఈ టీ20 లీగ్‌ ఆడుతూ వరుసగా విఫలమవుతున్నాడు. మధ్యలో టీమ్‌ఇండియాకు ఎంపికైనా ఒక్క మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేదు. ఇక ఈ లీగ్‌లోనూ ఎన్ని అవకాశాలిచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. అతడి వల్ల 2019 వన్డే ప్రపంచకప్‌లో అంబటిరాయుడు చోటు కోల్పోయాడని, ఇప్పుడు సాయిసుదర్శన్‌ అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాడని విమర్శలు చేస్తున్నారు. సాయి ఇటీవల పంజాబ్‌తో ఆడిన మ్యాచ్‌లో 35 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో అతడిని కాదని, విజయ్‌ను ఎలా తీసుకుంటున్నారని నిలదీస్తున్నారు. ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన విజయ్‌ శంకర్‌ 6.33 సగటుతో కేవలం 19 పరుగులే చేశాడు.

ఇవీ చూడండి: హార్దిక్​ పాండ్యాకు మళ్లీ ఏమైంది? బౌలింగ్​ చేస్తూ ఒక్కసారిగా..

అచ్చం జడ్డూలా బ్యాట్​ను తిప్పేసిన చాహల్​.. వీడియో వైరల్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.