ETV Bharat / sports

చెన్నై నడ్డి విరిచిన యువ పేసర్​.. అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శన!

author img

By

Published : Apr 4, 2022, 10:59 AM IST

Updated : Apr 4, 2022, 11:53 AM IST

vaibhav arora ipl career: చెన్నైతో ఆదివారం జరిగిన మ్యాచ్​లో పంజాబ్​ యువ పేసర్ వైభవ్​ అరోరా​ అందరి దృష్టిని ఆకర్షించాడు. పవర్​ ప్లేలోనే చెన్నై విధ్వంసకర బ్యాటర్లను పెవీలియన్​కు పంపాడు. అరంగేట్రంలోనే అదరగొట్టిన అతడి గురించే ఈ కథనం..

Vaibhav Arora
వైభవ్​ అరోరా

vaibhav arora ipl career: మెగా టీ20 లీగ్​ ఐపీఎల్​లో భాగంగా ఆదివారం రాత్రి బ్రబౌర్న్​ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్​లో చెన్నై​పై 54 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది పంజాబ్. 181 పరుగుల లక్ష్య ఛేదనలో డిఫెండింగ్​ ఛాంపియన్​ సీఎస్కే ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. చెన్నైని దెబ్బకొట్టి పంజాబ్​కు విజయం అందించడంలో యువ పేసర్​ వైభవ్​ అరోరా కీలక పాత్ర పోషించాడు. దీంతో అరంగేట్రంలోనే అదరగొట్టిన అతడి గురించి క్రికెట్​ అభిమానులు నెట్టింట్లో ఆరా తీయడం ప్రారంభించారు. ఇంతకి ఆ వైభవ్​ అరోరా ఎవరంటే?

Vaibhav Arora
వైభవ్​ అరోరా

ఐపీఎల్​లో అపార అనుభవం ఉన్న సందీప్​ శర్మ స్థానంలో జట్టులోకి వైభవ్​ను ఎంపిక చేయటంపై పలువురు సందేహం వ్యక్తం చేశారు. అయితే.. ఐపీఎల్​లో ఆడిన తొలి మ్యాచ్​లోనే అద్భుత ప్రదర్శనతో తనను ఎంపిక చేయటం సరైనదేనని చాటిచెప్పాడు ఈ యువ పేసర్​. పవర్​ ప్లేలోనే విధ్వంసకర బ్యాటర్లు రాబిన్ ఉతప్ప, మెయిన్​ అలీలను పెవీలియన్​కు చేర్చి సీఎస్కే బ్యాటింగ్ లైనప్​ను దెబ్బకొట్టాడు. మొత్తం నాలుగు ఓవర్లు వేసిన వైభవ్​.. 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

  • వైభవ్​ అరోరా ప్రస్థానం: 1997, డిసెంబర్​ నాలుగున జన్మించాడు. ప్రస్తుతం అతనికి 24 ఏళ్లు
  • దేశవాళీ క్రికెట్​లో హిమాచల్​ప్రదేశ్​ తరఫున ఆడాడు అరోరా. ఫస్ట్​క్లాస్​లో తొలిసారి 2019లో సౌరాష్ట్రపై అరంగేట్రం చేశాడు.
  • ఈ కుడిచేతి వాటం పేసర్​ 2021లో ఛత్తీస్​గఢ్​పై టీ20ల్లో అరంగేట్రం చేశాడు
  • గత ఐపీఎల్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​ జట్టు వైభవన్​ను తీసుకున్నా.. ప్లేయింగ్​ 11లో అవకాశం దగ్గలేదు.
  • ఇటీవల జరిగిన మెగా వేలంలో వైభవ్​ను కనీస ధర రూ. 2కోట్లు పెట్టి సొతం చేసుకుంది పంజాబ్​ కింగ్స్​ జట్టు
  • పంజాబ్​ పేసర్​ అర్షదీప్​ సింగ్​తో జూనియర్​ స్థాయి నుంచి కలిసి ఆడుతున్నాడు వైభవ్​. ఇరువురి మధ్య మంచి స్నేహబంధం ఉంది.
  • ఆర్థిక సమస్యల కారణంగా వైభవ్​ కొన్నాళ్ల క్రితం క్రికెట్​ను వీడాడు. అయితే, తన చిన్ననాటి కోచ్​ రవి వర్మ ప్రోత్సాహంతో మళ్లీ బాల్​ అందుకున్నాడు.

ఇదీ చూడండి: CSKvsPBKS: మ్యాచ్​ ఫలితంపై సీఎస్కే సారథి అలా.. పంజాబ్​ కెప్టెన్​ ఇలా!

Last Updated : Apr 4, 2022, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.