ఇండియన్ ప్రీమియర్ లీగ్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్.. మ్యాచ్‌కు ముందు స్టూడియోలో 'హాట్ ఆర్ నాట్' అనే పేరుతో నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ పట్ల నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. క్రికెట్ గురించి, క్రికెటర్లపై ప్రశ్నలు అడిగే నేపథ్యంలో సాగే ఈ షో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇలా పలు కార్యక్రమాల పేరిట మహిళా యాంకర్లను స్టూడియోలకు పిలిచి వారిని ఇబ్బంది పెడుతున్నారంటూ నెటిజన్లు ఫైరవుతున్నారు. అసలే జరిగిందంటే?
తాజాగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. అయితే మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు స్టార్ స్పోర్ట్స్‌లో నిర్వహించిన 'హాట్ ఆర్ నాట్' షోలో బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ కోడలు, టీమ్ఇండియా ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ.. సతీమణి మయంతి సహా మరో ముగ్గురు మహిళా యాంకర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బాలీవుడ్ నటుడు విద్యుత్ జమాల్, సురేన్ సుందరం కలిసి నిర్వహించారు. ప్రోగ్రామ్‌లో భాగంగా వారు భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్‌తో పాటు వెస్టిండీస్ బ్యాటర్ ఆండ్రీ రసెల్‌ల అర్ధనగ్న ఫొటోలను (చొక్కా లేకుండా ఉన్న ఫొటోలు) స్క్రీన్‌పైన చూపిస్తూ ఎవరు హాట్‌గా ఉన్నారో చెప్పాల్సిందిగా ప్రశ్నించారు.
ఈ ఫొటోల్లో వారందరూ కూడా స్విమ్మింగ్ ఫూల్లో ఉన్నప్పుడు తీసినట్టుగా ఉన్నాయి. వాటిపై వారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పటం అటుంచితే.. అసలు వాటిని చూసేందుకే ఆ యాంకర్లు ఇబ్బంది పడ్డారు. సోషల్ మీడియాలో ఇది గమనించిన పలువురు షో నిర్వాహకులపై మండిపడుతున్నారు. "ఇది క్రికెట్ షోనేనా లేదంటే ఇంకేమైనా సెన్సార్ షోనా?' మహిళా యాంకర్లను పిలిచి ఇలా ఇబ్బందులకు గురయ్యే ప్రశ్నలు అడగటం ఏంటి? స్పోర్ట్స్‌కు సంబంధించి మరెన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించకోవచ్చు. అంతేకానీ పిచ్చి పిచ్చి షోలు చేసి క్రికెట్ ప్రతిష్ఠను దిగజార్చొద్దు" అని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.
-
Is this a Cricket related show or what....Starsports u are disgrace#ViratKohli #SRHvRCB pic.twitter.com/gCygfzX8ga
— I am NEGAN (@IamNEGA62524296) May 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Is this a Cricket related show or what....Starsports u are disgrace#ViratKohli #SRHvRCB pic.twitter.com/gCygfzX8ga
— I am NEGAN (@IamNEGA62524296) May 18, 2023Is this a Cricket related show or what....Starsports u are disgrace#ViratKohli #SRHvRCB pic.twitter.com/gCygfzX8ga
— I am NEGAN (@IamNEGA62524296) May 18, 2023
అయితే హైదరాబాద్- బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో రెండు శతకాలు నమోదయ్యాయి. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకే మ్యాచ్‌లో సెంచరీలు చేయటం ఐపీఎల్లో ఇదే తొలిసారి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆ జట్టులో దక్షిణాఫ్రికా బ్యాటర్ క్లాసెన్ (104) సెంచరీతో కదంతొక్కాడు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన బెంగళూరు మొదటి నుంచే హైదరాబాద్‌పై ఆధిపత్యం చలాయించింది. ఓపెనర్లు విరాట్, డుప్లెసిస్ ఏ దశలోనూ ఆరెంజ్ఆర్మీ బౌలర్లకు ఛాన్స్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే విరాట్ భువనేశ్వర్ వేసిన 18వ ఓవర్ నాలుగో బంతికి సిక్స్ బాది ఐపీఎల్లో ఆరో శతకాన్ని నమోదు చేశాడు. తర్వాత విరాట్, డుప్లెసిస్(71) వెనుదిరిగినా మ్యాక్స్‌వెల్, బ్రేస్‌వెల్ మిగతా పని పూర్తి చేశారు. దీంతో బెంగళూరు.. ఈ సీజన్లో ఏడో విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.