ఐపీఎల్లో భాగంగా జరగనున్న తుది పోరుకు సమయం ఆసన్నమైంది. మే 28న జరగనున్న ఫైనల్స్ కోసం గుజరాత్‌లోని నరేంద్రమోదీ స్టేడియం సర్వం సిద్ధమైంది. అయితే మ్యాచ్ టికెట్ల విషయంలో కాస్త అవకతవకలు జరుగుతున్నాయి. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. స్లాట్‌లు తెరిచిన వెంటనే ఆన్‌లైన్ టిక్కెట్లు అమ్ముడవ్వడం వల్ల.. ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోసం అభిమానులు స్టేడియం వద్దకు బారులు తీశారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా ఆ టికెట్లను స్టేడియం దగ్గర వచ్చి తీసుకోవాలని నిర్వాహకులు సూచించారు. దీంతో అక్కడి వాతావరణం కాస్త ఉద్రిక్తతగా మారింది. టికెట్ కౌంటర్ వద్ద గుమిగూడిన జనాల మధ్య తోపులాట ప్రారంభమైంది. కౌంటర్ దగ్గరికి వెళ్లడానికి పోటీ పడటం వల్ల అభిమానులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. స్టేడియం వద్దకు చేరుకుని తోపులాటను సద్దుమణింగించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఆన్లైన్లో కన్వేయెన్స్ ఫీజు చెల్లించనప్పటికీ స్టేడియం దగ్గరకు వచ్చి టికెట్ తీసుకోవాలన్న నిబంధనపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ టికెట్ లేకపోతే ఆన్‌లైన్ లో బుక్ చేసుకున్నా.. మ్యాచ్ చూసే అవకాశం ఉండదని చెప్పడంతో ఇంకాస్త మండిపడుతున్నారు. స్టేడియం దగ్గర టికెట్ కౌంటర్లలోనూ ఎన్నో టికెట్లు మిస్ అయినట్లు ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. కౌంటర్ తెరిచిన క్షణాల్లోనే టికెట్లు మాయమైనట్లు కొందరు ట్విటర్ వేదికగా తమ గోడును వెల్లబోసుకున్నారు.
-
Look at the scenarios personal experience of ticket buying problems created by paytm final tickets after buying tickets and taking payment these are the problems we are facing @IPL @JayShah @GCAMotera . pic.twitter.com/H8G3LvxcWi
— Rahul Modi (@rahulm0902) May 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Look at the scenarios personal experience of ticket buying problems created by paytm final tickets after buying tickets and taking payment these are the problems we are facing @IPL @JayShah @GCAMotera . pic.twitter.com/H8G3LvxcWi
— Rahul Modi (@rahulm0902) May 25, 2023Look at the scenarios personal experience of ticket buying problems created by paytm final tickets after buying tickets and taking payment these are the problems we are facing @IPL @JayShah @GCAMotera . pic.twitter.com/H8G3LvxcWi
— Rahul Modi (@rahulm0902) May 25, 2023
దాదాపు 50,000లకు పైగా టిక్కెట్లు అమ్ముడు పోయినట్లు సమాచారం. చాలా మంది అభిమానులు ఈ టిక్కెట్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసారని టాక్. దీంతో మిగతా వారికి కొనుగోలు చేసేందుకు టిక్కెట్లు కరువయ్యాయట. దీంతో స్టేడియం వరకు వచ్చిన కొంతమంది అభిమానులు నిరాశతో వెనుతిరిగారు. ఆన్లైన్లో టికెట్లు వేగంగా అమ్మడపోయాయని.. పరిచయస్తుల ద్వారా కొనుగోలు చేయాలని ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఒక అభిమాని అంటుండగా.. మరొకరేమో ఆన్‌లైన్ టిక్కెట్ విక్రయ నియమాలలో తరచుగా మార్పులు ఉంటున్నాయని..దీని వల్ల ఆఫ్‌లైన్‌లో టిక్కెట్‌లను కొనుగోలు చేయలనుకుంటే అది కూడా అసాధ్యంగా ఉందని వాపోయారు. కార్పొరేట్ సర్కిల్స్‌లో సైతం గత రెండు రోజులుగా పాస్‌ల కోసం ప్రజలు నానా తంటాలు పడుతున్నారని సమాచారం. కాగా ఫైనల్ మ్యాచ్ కోసం ఫిజికల్ టిక్కెట్లను పొందేందుకు మే25 నుంచి 27 వరకు అవకాశం ఇచ్చారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సీఎస్కేతో జరగనున్న ఫైనల్స్ కోసం తలపడబోయే టీమ్ ఏదో శుక్రవారం తేలనుంది. ఫైనల్స్ జరగనున్న అదే నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ పోరు జరగనుంది. ఈ క్రమంలో ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటన్స్.. క్వాలిఫయర్ 2 రౌండ్లో పోటీ పడనున్నాయి. ఇందులో గెలుపొందిన టీమ్.. ఆదివారం జరగున్న మ్యాచ్‌లో సీఎస్కేతో తలపడనుంది.
-
Hey @paytminsider in the ipl final booking ticket page it is showing coming soon, will the ticket window again open? pic.twitter.com/1Xmj7Ypsl7
— Himanshu jain (@himanshu_jain7) May 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hey @paytminsider in the ipl final booking ticket page it is showing coming soon, will the ticket window again open? pic.twitter.com/1Xmj7Ypsl7
— Himanshu jain (@himanshu_jain7) May 25, 2023Hey @paytminsider in the ipl final booking ticket page it is showing coming soon, will the ticket window again open? pic.twitter.com/1Xmj7Ypsl7
— Himanshu jain (@himanshu_jain7) May 25, 2023