ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు స్టీవ్ స్మిత్ తెలిపాడు. రికీ పాంటింగ్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ఇటీవలే జరిగిన ఐపీఎల్ వేలంలో రూ.2.2 కోట్లకు స్మిత్‌ను దిల్లీ కొనుక్కుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"ఈ ఏడాది దిల్లీ జట్టులో చేరేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు.. గొప్ప కోచ్ ఉన్నారు. వీలైనంత త్వరగా జట్టులో చేరాలని.. కొన్ని మధుర జ్ఞాపకాల్ని సృష్టించుకోవాలని భావిస్తున్నా. దిల్లీ జట్టు గత ఏడాది కంటే మరో మెట్టు మెరుగైన స్థితికి చేరుకోవాలని కోరుకుంటున్నా" అని స్మిత్ చెప్పాడు. 2020 ఐపీఎల్‌లో దిల్లీ రన్నరప్‌గా నిలిచింది.
ఇదీ చూడండి: '36 చేదు జ్ఞాపకం మాకుంటే ఇంగ్లాండ్‌కు 58'