ETV Bharat / sports

కోహ్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో తొలగింపు! - కోహ్లీ కైల్ జేమిసన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్లు డేనియల్ క్రిస్టియన్, కైల్ జేమిసన్​కు ఫ్రాంచైజీ వార్నింగ్ ఇచ్చిందని సమచారం. కోహ్లీపై ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం.

RCB requets removal of a Video featuring Danial Christian
కోహ్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో తొలగింపు!
author img

By

Published : May 1, 2021, 6:07 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ డేనియల్ క్రిస్టియన్​కు ఫ్రాంచైజీ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో కోహ్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం. ఇతడితో పాటు పేసర్ కైల్ జేమిసన్​కు కూడా వార్నింగ్ ఇచ్చారట. అతడు కూడా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం ద్వారా ఫ్రాంచైజీ నిబంధనలు ఉల్లఘించిన్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఈ వీడియోను డెలిట్ చేసింది ఆ సంస్థ.

విషయమేంటంటే.. ది గ్రేడ్ క్రికెటర్ అనే యూట్యూబ్ ఛానెల్​ ఇంటర్వ్యూలో ఆర్సీబీ క్రికెటర్లు డేనియన్ క్రిస్టియన్, కైల్ జేమిసన్ పాల్గొన్నారు. ఇందులో జేమిసన్.. ప్రస్తుతం కోహ్లీ దృష్టంతా టెస్టు ఛాంపియన్ షిప్​ ఫైనల్​పైనే ఉందని, అందుకే అతడు డ్యూక్ బంతితో బౌలింగ్ చేయమని కోరాడని వెల్లడించాడు. అలాగే క్రిస్టియన్.. కోహ్లీ కేవలం కొన్ని టీమ్ మీటింగ్​లకు మాత్రమే హాజరవుతాడని చెప్పాడు.

దీంతో ఆగ్రహించిన ఫ్రాంచైజీ వీరివురికి వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే డేనియల్ స్వయంగా ఈ వీడియోను తొలగించాలని ఆ ఛానెల్​ను కోరాడు. ఈ విషయాన్ని ఆ ఛానెల్ వ్యాఖ్యాత అయిన సామ్ పెర్రీ ధ్రువీకరించారు. ఇది ఐపీఎల్​ నిబంధనలకు విరుద్దమని, అందుకే దానిని తొలగించమని క్రిస్టియన్ కోరినట్లు సామ్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.