ETV Bharat / sports

'బయట భయానకం.. బబుల్​లోనే సురక్షితం' - quite grim

భారత్​లో నెలకొన్న కొవిడ్ పరిస్థితులపై దిల్లీ క్యాపిటల్స్​ ప్రధాన కోచ్​ రికీ పాంటింగ్ స్పందించాడు. ఐపీఎల్​ వల్ల తాము అత్యంత సురక్షిత ప్రదేశంలో ఉన్నామని తెలిపాడు. బయట పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయని పేర్కొన్నాడు.

ricky ponting, delhi capitals head coach
రికీ పాంటింగ్, దిల్లీ క్యాపిటల్స్​ ప్రధాన కోచ్
author img

By

Published : Apr 26, 2021, 7:05 PM IST

కొవిడ్​ నేపథ్యంలో ఐపీఎల్​ నుంచి ఆటగాళ్లు ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తున్న వేళ దిల్లీ క్యాపిటల్స్​ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ స్పందించాడు. ఇప్పుడు బయో బబుల్​ లాంటి సురక్షితమైన ప్రదేశం మరొకటి లేదని అభిప్రాయపడ్డాడు. బయట పరిస్థితులు అత్యంత భయంకరంగా ఉన్నాయని తెలిపాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్​ను స్వాగతించాల్సిందేనని పేర్కొన్నాడు.

"విరామ సమయాల్లో నేను తరచుగా ఆటగాళ్లతో మాట్లాడతాను. బయటి పరిస్థితులు ఎలా ఉన్నాయి.. మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారని అడుగుతుంటాను. అది చాలా ముఖ్యం కూడా. ఐపీఎల్​ వల్ల మేము సురక్షితమైన ప్రదేశంలో ఉన్నాము. తాజా పరిస్థితుల్లో లీగ్​ అనేది ప్రజలకు ఎంతో కొంత ఆనందాన్ని ఇస్తుందనుకుంటున్నాను."

-రికీ పాంటింగ్, దిల్లీ క్యాపిటల్స్​ ప్రధాన కోచ్.

"ఇన్ని రోజులు కుర్రాళ్లు చెన్నైలో సొంత గడ్డపై ఉన్నారు. అయినా కుటుంబ సభ్యులను కలవలేకపోయారు. ఇది చాలా క్లిష్టమైన అంశం. సన్​రైజర్స్​తో మ్యాచ్​ అనంతరం అశ్విన్ లీగ్​ను వీడుతున్నట్లు తెలిపాడు. తమ కుటుంబ సభ్యులు కరోనా పోరాడుతున్నారని వెల్లడించాడు" అని దిల్లీ కోచ్ చెప్పాడు.

ఇదీ చదవండి: 'పీఎం కేర్స్​'కు ఆసీస్​ పేసర్​ కమిన్స్ విరాళం

దిల్లీ జట్టు అనేది ఒక కుటుంబం లాంటిందని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. మహమ్మారి సమయంలో కుటుంబాలకు దూరంగా గడపడం ఇబ్బందికరంగా ఉంటుందన్నాడు. బయట ఉన్న ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

బబుల్​లోనే సేఫ్: నైల్

కరోనా నేపథ్యంలో ఆసీస్​ ఆటగాళ్లు ఒక్కొక్కరు స్వదేశానికి వెళ్తున్న నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్​ కౌల్టర్​ నైల్ స్పందించాడు. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్​కు ఆడుతున్న ఈ ఆల్​రౌండర్.. బయో బబులే సురక్షితమైన ప్రాంతం అని తెలిపాడు. ఇప్పటికే ఆడం జంపా, రిచర్డ్​సన్, ఆండ్రూ టై.. లీగ్​ను వీడుతున్నట్లు పేర్కొన్నారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఇక్కడే ఉండడం క్షేమమని నైల్ అభిప్రాయపడ్డాడు.

ఇదీ చదవండి: కామన్వెల్త్​ క్రీడల్లో పాల్గొనే క్రికెట్​ జట్లు ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.