ETV Bharat / sports

'ఐపీఎల్​' పండుగ ఆరంభమై నేటితో 14 ఏళ్లు

ఐపీఎల్​ అంటే అభిమానించని వారుండరు. నేటితో ఐపీఎల్ ప్రారంభమై సరిగ్గా 14 ఏళ్లు అయింది. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్​ ఏఏ జట్ల మధ్య జరిగింది. ఐపీఎల్​కు ఎందుకింత ఆదరణ లభించిందో ఓసారి పరిశీలిద్దాం.

mccullam, first IPL match
మెకల్లమ్, మొదటి ఐపీఎల్ మ్యాచ్
author img

By

Published : Apr 18, 2021, 3:06 PM IST

ఐపీఎల్​.. భారత్​లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆదరణ పొందింది. ఈ క్రికెట్​ పండుగ ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే రోజున తొలి మ్యాచ్​ జరిగింది. అప్పటి నుంచి క్రికెట్​ అభిమానులను అలరిస్తూనే ఉంది. ఐపీఎల్​కు ఎందుకు ఇంత క్రేజ్​ లభించింది? ఓసారి లుక్కేద్దాం.

2008, ఏప్రిల్​ 18న..

2008 ఏప్రిల్​ 18న మొదటి ఐపీఎల్​ మ్యాచ్​ జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్​కతా నైట్ రైడర్స్​ తలపడ్డాయి. అయితే.. ఆరంభంలో జరిగిన మ్యాచ్​లోనే ఐపీఎల్​ అంటే అభిమానుల్లో కొత్త ఉత్సాహం వచ్చేలా ఆడింది కోల్​కతా జట్టు.

మెకల్లమ్​ మెరుపు ఇన్నింగ్స్​..

టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న ఆర్సీబీ జట్టుకు ఆదిలోనే చుక్కలు చూపించాడు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్. 16వ ఓవర్లో 100 పరుగులు పూర్తి చేసిన మెకల్లమ్ చివరి వరకూ క్రీజ్​లో నిలిచాడు. చివరి 4 ఓవర్లలో 56 రన్స్​తో మొత్తంగా 158 పరుగులు చేశాడు. దీంతో కోల్​కతా మూడు వికెట్ల నష్టానికి పరిమిత 20 ఓవర్లలో 222 పరుగులు లక్ష్యాన్ని ఆర్సీబీ ముందుంచింది.

ఛేదనలో బెంగళూరు జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. 82 పరుగులకే ఆర్సీబీని కుప్పకూల్చింది కోల్​కతా. ఈ దెబ్బతో ఘనమైన మొదటి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది కోల్​కతా. కానీ, అనూహ్యంగా కోల్​కతా జట్టు సెమీఫైనల్​కు కూడా చేరుకోలేదు.

రాజస్థాన్​ ఖాతాలో తొలి ట్రోఫీ..

మొదటి ఐపీఎల్​ కప్పు గెలిచిన ఘనతను రాజస్థాన్​ రాయల్స్​ తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు జరిగిన 13 ఐపీఎల్​ సీజన్​లలో ముంబయి జట్టు అత్యధికంగా ఐదు సార్లు ట్రఫీ​ గెలవగా.. చెన్నై జట్టు మూడు సార్లు కప్​ను సొంతం చేసుకుంది. కోల్​కతా రెండు సార్లు కప్​ గెలిచింది.

ప్రస్తుతం 14వ ఎడిషన్​ ఐపీఎల్ సీజన్​​ జరుగుతోంది.

ఇదీ చదవండి:ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా: ఆనంద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.