ETV Bharat / sports

ఐపీఎల్​లో నికోలస్ పూరన్ చెత్త రికార్డు

ఐపీఎల్​లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్​మన్ నికోలస్ పూరన్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. నేడు సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో డకౌట్​గా వెనుదిరిగాడు పూరన్.

Nicholas Pooran
నికోలస్ పూరన్
author img

By

Published : Apr 21, 2021, 9:45 PM IST

పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో రనౌట్​గా వెనుదిరిగిన పంజాబ్ బ్యాట్స్​మన్ నికోలస్ పూరన్ సీజన్​లో మూడోసారి సున్నా పరుగులకే ఔటై తీవ్రంగా నిరాశపర్చాడు. ఈ క్రమంలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

ఐపీఎల్​లో ఇప్పటివరకు ఒక బంతికి, రెండు బంతులకు, మూడు బంతులకు డకౌట్​గా వెనుదిరిగిన మొదట ఆటగాడిగా చెత్త రికార్డు సృష్టించాడు పూరన్. ఈ సీజన్​లో మొదటి రెండు మ్యాచ్​ల్లో డకౌటైన పూరన్​ మూడో మ్యాచ్​లో మాత్రం 9 పరుగులు చేశాడు. మళ్లీ ఈరోజు సన్​రైజర్స్​తో జరిగిన మ్యాచ్​లో సున్నా పరుగులకే వెనుదిరిగాడు.

  • Nicholas Pooran is now the first player in IPL history to have a 2 ball duck, 1 ball duck and a 0 ball duck in the same season.

    — Mufaddal Vohra (@mufaddal_vohra) April 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్​ నిర్ణీత ఓవర్లలో 120 పరుగులే చేయగలిగింది. మయాంక్ (22), షారుఖ్ ఖాన్ (22) మాత్రమే పర్వాలేదనిపించారు. మిగతా వారు దారుణంగా విఫలమయ్యారు. ఖలీల్ అహ్మద్ 3 వికెట్లతో రాణించాడు. అనంతరం 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది సన్​రైజర్స్. బెయిర్​స్టో (63) అర్ధశతకంతో రాణించగా వార్నర్ (37) ఆకట్టుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.