ఐపీఎల్(IPL 2021) ఫ్లేఆఫ్స్ దశకు వచ్చేసింది. నాలుగు జట్లు కప్పు కోసం పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి. ఆటను పక్కనపెడితే.. ఓ యాంకర్, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆమెనే తమన్నా వహి(tamanna wahi ipl). ఆమె గురించే ఈ స్టోరీ.
తమన్నా వహి ప్రొఫెషనల్ యాంకర్, ప్రజెంటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్. అబుదాబీలో పుట్టిన ఆమె.. ప్రస్తుత ఐపీఎల్ కోసం యాంకరింగ్ చేస్తోంది.
బ్లాగింగ్, యాంకరింగ్ కాకుండా వేరే ఉద్యోగం కూడా చేస్తోంది. 2013 నుంచి కడఖ్ ఎఫ్ఎమ్లో ఈమె విధులు నిర్వర్తిస్తోంది.
2016లో బెస్ట్ ఆసియా బ్లాగర్ అవార్డును తమన్నా వహి సొంతం చేసుకుంది.
గతేడాది ఐపీఎల్ సందర్భంగా యూఏఈ ట్రావెలింగ్ వీడియో పోస్ట్ చేసి ఆమె తెగ పాపులర్ అయింది.
ఈమె బాలీవుడ్ సినిమాలకు పెద్ద అభిమాని. 'కభీ ఖుషీ కభీ ఘమ్' తమన్నా ఫేవరెట్.