ETV Bharat / sports

సోదరులతో పనిచేస్తున్నట్లే: ఐపీఎల్​పై నవనీత - ఐపీఎల్ 2021 నవనీత గౌతమ్

కోల్​కతా నైట్​రైడర్స్​-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(rcb vs kkr 2021) మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్​లో అందరి దృష్టినీ ఆకర్షించింది మసాజ్ థెరపిస్ట్ నవనీత గౌతమ్. ఈ నేపథ్యంలో ఆమె గురించిన ఆసక్తికర విషయాలు మీకోసం.

Navnita Gautam
నవనీత
author img

By

Published : Sep 23, 2021, 6:22 PM IST

ఐపీఎల్ (IPL 2021 news)​ రెండోదశలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుపై కోల్​కతా నైట్​రైడర్స్(rcb vs kkr 2021)​ ఘనవిజయం సాధించింది(పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి). ఈ మ్యాచ్​లో ఆర్సీబీ 92 పరుగులకే ఆలౌట్​ అవ్వగా.. తర్వాత బ్యాటింగ్​కు వచ్చిన కోల్​కతా 10 ఓవర్లలో మ్యాచ్​ను ముగించింది. అయితే ఆర్సీబీ బ్యాటింగ్​ చేస్తున్న సమయంలో ఆ జట్టు డగౌట్​లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.

Navnita Gautam
నవనీత

ఆర్సీబీ స్కోర్​ 53/4 ఉండగా ఆర్సీబీ బ్యాట్స్​మన్​ జేమీసన్(kyle jamieson rcb)​ 8వ స్థానంలో బ్యాటింగ్​కు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో ఆర్సీబీకి చెందిన మసాజ్​ థెరపిస్ట్​ నవనీతా గౌతమ్(navnita gautam rcb)​.. జేమీసన్​ మధ్య నవ్వులు చిగురించాయి. ఈ సన్నివేశమంతా కెమెరా కంట పడింది. దీంతో దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్​మీడియాలో విపరీతంగా వైరల్​ అయ్యాయి. దీంతో అసలు నవనీత(navnita gautam rcb) ఎవరనే ఆసక్తి అభిమానుల్లో కలిగింది. అదే అదనుగా ఆమె సోషల్ మీడియా అకౌంట్లను వెతికే పనిలో పడ్డారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో నవనీత గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

Navnita Gautam
నవనీత, జేమిసన్
  • 1992 ఏప్రిల్ 11న కెనడాలోని వాంకోవర్​లో జన్మించింది నవనీత గౌతమ్(navnita gautam rcb).
  • 2019లో ఆర్సీబీ జట్టుకు స్పోర్ట్స్ మసాజ్ థెరపిస్ట్​గా నియమించబడింది నవనీత గౌతమ్(navnita gautam rcb). ఐపీఎల్​లో ఓ జట్టుకు సహాయ సిబ్బందిగా ఎంపికైన తొలి మహిళ ఈమె కావడం గమనార్హం. మరే జట్టు సహాయ బృందంలోనూ మహిళలు లేరు.
  • ఆర్సీబీలో జాయిన్ కావడానికి ముందు గ్లోబల్ టీ20 కెనడా టోర్నీలో టొరంటో నేషనల్ టీమ్​కు పని చేసింది నవనీత(navnita gautam rcb).
    Navnita Gautam
    ఆర్సీబీ సహాయ బృందంతో నవనీత
  • ఆసియా కప్ సమయంలో భారత మహిళల బాస్కెట్​బాల్​ జట్టుకూ సేవలందించింది.
  • 2019లో ఆర్సీబీ సహాయ సిబ్బందిలో భాగమైనపుడు ఈ విధంగా స్పందించింది నవనీత. "ఐపీఎల్(ipl 2021 live)​ జట్టుకు సేవలందిస్తోన్న ఏకైక మహిళగా గుర్తింపు సాధించడం ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తోందా?" అన్న ప్రశ్నకు.. "అస్సలు లేదు. ప్రతిసారి చుట్టూ 20 మంది సోదరులు నాతో ఉన్నట్లు ఉంటుంది. ఆటగాళ్లు, సహాయ సిబ్బంది నా పనిపై నమ్మకం ఉంచినంత కాలం లింగభేదం అనేది సమస్యగా ఉండదు" అని తెలిపింది నవనీత.
    Navnita Gautam
    యువరాజ్​తో నవనీత

ఇవీ చూడండి: సన్​రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరి!. కారణాలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.