ETV Bharat / sports

IPL 2022 KKR: కోల్​'కథ' కంచికేనా?.. వరుసగా ఐదు ఓటములు - ఐపీఎల్​ 2022 న్యూస్​

IPL 2022 KKR: కోల్‌కతా టీమ్‌ గతేడాది లీగ్‌ స్టేజ్‌ పూర్తయ్యేసరికి ముంబయితో సమానంగా 14 పాయింట్లతో నిలిచింది. కానీ, నెట్‌రన్‌రేట్‌ మెరుగ్గా ఉండటం వల్ల ఆ జట్టును వెనక్కినెట్టి చివరి క్షణాల్లో నాకౌట్‌ దశకు చేరుకుంది. అక్కడి నుంచి ఫైనల్‌కు దూసుకెళ్లి.. త్రుటిలో చెన్నై చేతిలో ఓటమిపాలైంది. దీంతో కప్పు కోల్పోయి రన్నరప్‌గా నిలిచింది. అలాంటి జట్టు.. ఈసారి మరీ దారుణంగా ఆడుతోంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలే సాధించి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఐదు వరుస ఓటములకు కారణాలేంటో విశ్లేషిస్తే..

IPL 2022 KKR
IPL 2022 KKR
author img

By

Published : Apr 29, 2022, 4:41 PM IST

IPL 2022 KKR: టోర్నీ ప్రారంభానికి ముందే కోల్‌కతాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు ప్రధాన కారణం శ్రేయస్‌ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించడమే. అంతకుముందు అతడు దిల్లీ తరఫున బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా రాణించి ఆ జట్టును మెరుగైన స్థితికి తీసుకొచ్చాడు. దాన్ని ఇప్పుడు పంత్‌ ముందుకు నడిపిస్తున్నాడు. మరోవైపు గతేడాది కోల్‌కతా కెప్టెన్‌గా ఉన్న ఇయాన్‌ మోర్గాన్‌ బ్యాట్స్‌మన్‌గా విఫలమైనా.. తన కెప్టెన్సీ అనుభవంతో జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అయితే, ఈ సీజన్‌కు ముందు శ్రేయస్‌ బ్యాటింగ్‌ పరంగానూ అత్యుత్తమ ఫామ్‌లో ఉండటం వల్ల ఈసారి ఆ జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తీరా చూస్తే ఇప్పుడు పరిస్థితులు తలకిందులయ్యాయి. వరుసగా ఐదు ఓటముల పాలై ఎనిమిదో స్థానానికి దిగజారింది. ఇలాంటి స్థితిలో కోల్‌కతా ప్లేఆఫ్స్‌కు చేరడం చాలా కష్టమే.

IPL 2022 News
వెంకటేశ్​ అయ్యర్

టాప్ ఆర్డర్‌ తడబాటు..: గతేడాది సగం సీజన్‌ పూర్తయ్యేసరికి కూడా కోల్‌కతా ఇలాగే పలు ఓటములతో సతమతమైంది. కానీ, రెండో లెగ్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగాక ఆ జట్టు స్వరూపమే మారిపోయింది. రెండు చేతులా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతడు ఎవరూ ఊహించని రీతిలో బ్యాటింగ్‌ చేశాడు. నాలుగు అర్ధ శతకాలతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దీంతో కోల్‌కతా ఉత్కంఠపరిస్థితుల నడుమ నెట్‌ రన్‌రేట్‌తో పోటీపడి ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంది. అలాగే వెంకటేశ్‌కు.. శుభ్‌మన్‌ గిల్‌, నితీశ్‌ రాణా, సునీల్‌ నరైన్‌ పలు సందర్భాల్లో మంచి సహకారం అందించారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈసారి వెంకటేశ్‌ ఓపెనర్‌గా విఫలమవుతున్నాడు. అతడికి జోడీగా అజింక్య రహానె, ఆరోన్‌ ఫించ్‌లు చెరో ఇన్నింగ్స్‌లోనే ఆకట్టుకున్నా తర్వాత చేతులెత్తేశారు. ఈ ముగ్గుర్ని మార్చి చూసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో ప్రస్తుతం కోల్‌కతా జట్టుకు సరైన టాప్‌ఆర్డర్‌ కాంబినేషన్‌ను సెట్‌ చేసుకోవడమే కష్టంగా మారింది. ఈ మాటలు స్వయంగా శ్రేయస్‌ అయ్యరే గతరాత్రి ఓటమి అనంతరం వెల్లడించడం ఆ జట్టు పరిస్థితిని తెలియజేస్తుంది.

IPL 2022 News
శ్రేయస్ అయ్యర్

శ్రేయస్ అయ్యర్‌ అంతంతే..: కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కూడా తొలి నాలుగు మ్యాచ్‌ల్లో 20*, 13 , 26, 10 పెద్దగా రాణించింది లేదు. మధ్యలో దిల్లీ, రాజస్థాన్‌ జట్లపై 54, 85 అర్ధ శతకాలతో మెరిసినా జట్టును విజయతీరాలకు చేర్చలేదు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌, గుజరాత్‌ జట్లపైనా మళ్లీ విఫలమయ్యాడు. చివరగా గతరాత్రి దిల్లీపై 42 పరుగులు చేశాడు. దీంతో అతడు ఈ సీజన్‌లో బ్యాట్స్‌మన్‌గా 290 పరుగులు చేసి నామమాత్రంగా రాణిస్తున్నాడు. శ్రేయస్‌ అంటేనే నిలకడగా పరుగులు సాధించగల సత్తా ఉన్న ఆటగాడు. కానీ, ప్రస్తుత టోర్నీలో మాత్రం తన స్టామినాకు తగ్గ ప్రదర్శనలు చేయలేకపోతున్నాడు. అలాగే కెప్టెన్‌గానూ మైదానంలో చురుగ్గా కనిపించడంలేదు. పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవడంలోనూ మునుపటిలా ప్రభావవంతంగా కనిపించడం లేదు.

IPL 2022 News
సునిల్ నరైన్​

మిడిల్‌ ఆర్డర్‌ ఢమాల్‌..: కోల్‌కతా విజయాల్లో కీలక పాత్ర పోషించేది మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఈ సీజన్‌లో అది స్పష్టంగా విఫలమైనట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ఆ జట్టుకు సునీల్‌ నరైన్‌, ఆండ్రీ రసెల్‌ ఫినిషింగ్‌ టచ్‌లతో మెరుపు ముగింపులిచ్చేవాళ్లు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. నితీశ్‌ రాణా, ఆండ్రీ రసెల్‌, సునీల్‌ నరైన్‌ మిడిల్‌ ఆర్డర్‌లో వస్తున్నా జట్టుకు ఊపునిచ్చే ఇన్నింగ్స్‌ ఆడలేకపోతున్నారు. నితీశ్‌, రసెల్‌ రెండు, మూడు మ్యాచ్‌ల్లో మంచి ఇన్నింగ్స్‌లే ఆడినా మిగతా వారి నుంచి సరైన సహకారం లంభించలేదు. నితీశ్ రెండు అర్ధ శతకాలు, రసెల్‌ మూడు ఇన్నింగ్స్‌ల్లో మెరిసినా.. కీలక సందర్భాల్లో విఫలమవ్వడం ఆ జట్టు ఓటములకు ఒక కారణంగా చెప్పొచ్చు. అలాగే ఈ టోర్నీలో ఎంతో అనుభవమున్న సునీల్‌ నరైన్‌ లాంటి స్టార్‌ ఆల్‌రౌండర్‌ పూర్తిగా తేలిపోయాడు. అతడు ఆడిన ఆరు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 27 పరుగులే చేశాడంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడు మెరిస్తే కానీ జట్టు పరిస్థితి మారేలా లేదు.

IPL 2022 News
ప్యాట్ కమిన్స్​

ప్యాట్‌ కమిన్స్‌ లేడేంటి..: ఈ సీజన్‌లో ముంబయితో కోల్‌కతా ఆడిన తన నాలుగో మ్యాచ్‌లో ప్యాట్‌ కమిన్స్‌ (56*; 15 బంతుల్లో 4x4, 6x6) బ్యాటింగ్‌తో విశ్వరూపం చూపించాడు. కేవలం 14 బంతుల్లో అర్ధశతకం సాధించి టోర్నీకి కొత్త జోష్‌ తీసుకొచ్చాడు. అలాంటి కీలక ఆల్‌రౌండర్‌ కేవలం నాలుగు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. తర్వాత అతడు తుది జట్టులోనే లేకుండా పోయాడు. అయితే, కమిన్స్ బౌలింగ్‌లో విఫలమవ్వడం వల్ల అతడిని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. ఆడిన 4 మ్యాచ్‌ల్లో భారీ ఎకానమీ (12)తో కేవలం 4 వికెట్లే తీయడం గమనార్హం. పరుగులిచ్చినంత మాత్రాన అతడి లాంటి కీలక ఆల్‌రౌండర్‌ను ఎందుకు ఆడించడం లేదని యువరాజ్‌ సింగ్‌ ప్రశ్నించాడు. దీనికి కోల్‌కతా ఏం సమాధానం చెబుతుందో చూడాలి. మరోవైపు సీనియర్‌ పేసర్లు ఉమేశ్‌ యాదవ్‌, ఆండ్రీ రసెల్ మాత్రమే బౌలింగ్‌లో ఆ జట్టుకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నారు. అయితే, కొంతకాలంగా ఈ జట్టులో విఫలమైన కుల్‌దీప్‌ యాదవ్‌ ఈసారి దిల్లీ జట్టులో విశేషంగా రాణించడం కోల్‌కతాకు మింగుడపడటం లేదు. మరీ ముఖ్యంగా దిల్లీతో తలపడిన రెండు మ్యాచ్‌ల్లోనూ కుల్‌దీప్‌.. కోల్‌కతాను నాలుగేసి వికెట్లతో చావుదెబ్బకొట్టాడు.

ఇదీ జరిగింది: కారణం తెలియడంలేదు.. కష్టంగా ఉంది: శ్రేయస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.