ETV Bharat / sports

రాజస్థాన్​కు షాక్.. సీజన్​ మొత్తానికి అతడు​ దూరం! - cricket news

తీవ్ర గాయమైన కారణంగా ఈ సీజన్​ మొత్తానికి స్టార్ క్రికెటర్ స్టోక్స్ దూరమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు త్వరలో ఇంగ్లాండ్ పయనం కానున్నాడు.

Ben Stokes ruled out of IPL with suspected broken hand
రాజస్థాన్​కు షాక్.. సీజన్​ మొత్తానికి అతడు​ దూరం!
author img

By

Published : Apr 13, 2021, 10:36 PM IST

రాజస్థాన్​ రాయల్స్​కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్​రౌండర్​ బెన్ స్టోక్స్.. గాయం కారణంగా ఈ సీజన్​ మొత్తానికే దూరమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయమై ఇంగ్లాండ్​ బోర్డు, రాజస్థాన్ ఫ్రాంచైజీ మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

పంజాబ్​ కింగ్స్​తో సోమవారం జరిగిన మ్యాచ్​లో గేల్​ క్యాచ్​ పట్టిన సమయంలో స్టోక్స్​ చూపుడు వేలులోని ఎముక పక్కకు జరిగినట్లు తెలుస్తోంది. తర్వాత టెస్టు చేయగా, గాయం తీవ్రమైనదిగా తేలిందట. దీంతో త్వరలో అతడు ఇంగ్లాండ్​ తిరుగు ప్రయాణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్చర్​ దూరమైన నేపథ్యంలో, స్టోక్స్​ కూడా లేకపోవడం రాజస్థాన్​కు పెద్ద ఎదురుదెబ్బే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.