ETV Bharat / sports

ఐపీఎల్: పంజాబ్​పై చెన్నై విజయం సాధిస్తుందా? - DHONI IPL NEWS

వాంఖడే వేదికగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్​కింగ్స్ తలపడనున్నాయి. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

IPL PREVIEW: CSK eye improved bowling effort against formidable Punjab Kings
ఐపీఎల్: పంజాబ్​పై చెన్నై విజయం సాధిస్తుందా?
author img

By

Published : Apr 16, 2021, 5:31 AM IST

చెన్నై సూపర్​కింగ్స్​తో మ్యాచ్​కు పంజాబ్ కింగ్స్​ సిద్ధమైంది. ఈ రెండు జట్లు.. వాంఖడేలో శుక్రవారం తలపడనున్నాయి. తొలి మ్యాచ్​లో గెలిచి జోరు మీదున్న పంజాబ్​ను.. దిల్లీ చేతిలో చిత్తయిన సీఎస్కే ఏమాత్రం నిలువరిస్తుందో చూడాలి?

CSK VS PBKS
చెన్నై క్రికెటర్లు ప్రాక్టీసు

ధోనీ నేతృత్వంలోని చెన్నై జ్టటు.. ఈ సీజన్​ను ఎంతో ఉత్సాహంతో ప్రారంభించింది. కానీ తొలి మ్యాచ్​లో దిల్లీ చేతిలో ఓడిపోయింది. బ్యాటింగ్​లో రాణించినప్పటికీ, బౌలింగ్​లో తేలిపోయింది. ఈ తప్పుల్ని సరిచేసుకుని రెండో మ్యాచ్​లో బరిలోకి దిగితే విజయం దక్కొచ్చు. తొలి పోరులో డకౌట్​ అయిన ధోనీ.. ఈ మ్యాచ్​లో బ్యాట్​తో అదరగొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరోవైపు పంజాబ్​ కింగ్స్.. బ్యాటింగ్​లో అలరిస్తున్నప్పటికీ, బౌలింగ్​లో మాత్రం విఫలమవుతోంది. ఈ విషయంలో వాళ్లు దృష్టి సారించాలి. లేదంటే చెన్నై చేతిలో ఓడిపోయే ప్రమాదముంది.

CSK VS PBKS
ప్రాక్టీసులో పంజాబ్ బౌలర్లు

జట్లు(అంచనా)

చెన్నై సూపర్​కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, రాయుడు, డుప్లెసిస్, సురేశ్ రైనా, ధోనీ(కెప్టెన్), మొయిన్ అలీ, జడేజా, సామ్ కరన్, బ్రావో, శార్దుల్ ఠాకుర్, దీపక్ చాహర్

పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్​, వికెట్​ కీపర్​), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, దీపక్ హూడా, షారుఖ్ ఖాన్, రిచర్డ్సన్, మురుగన్ అశ్విన్, రిలే మెరెడిత్, మహ్మద్ షమీ, అర్ష్​దీప్​ సింగ్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.