ఈ ఐపీఎల్(IPL 2021 News) సీజన్లో దిల్లీ క్యాపిటల్స్(delhi capitals ipl record) ఓ అరుదైన రికార్డు సాధించింది. బలమైన జట్లుగా పేరుగాంచిన ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ను ఒకే సీజన్లో రెండు సార్లు ఓడించిన తొలి జట్టుగా ఘనత సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. సోమవారం(అక్టోబర్ 4) సీఎస్కేపై విజయం సాధించిన తర్వాత ఈ మార్క్‌ను అందుకుంది.
ధోనీ చెత్త రికార్డు
దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి స్లో బ్యాటింగ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు ధోనీ(ms dhoni stats). ఈ మ్యాచ్‌లో ఇతడు 27 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 10 డాట్ బాల్స్ ఉన్నాయి. అలాగే 66.6 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు మహీ. లీగ్ చరిత్రలో ఇతడికిదే అతి తక్కువ స్ట్రైక్ రేట్ (తొలి 25 బంతుల్లో). ఇంతకుముందు 2008లో దక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 74.19 స్ట్రైక్ రేట్‌తో 23 పరుగులు చేశాడు.
దిల్లీ గెలిచింది
సోమవారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీ(dc vs csk 2021) 3 వికెట్ల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. రాయుడు (55 నాటౌట్; 43 బంతుల్లో 5×4, 2×6) పోరాడడం వల్ల మొదట చెన్నై 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (2/18), అశ్విన్ (1/20) చెన్నైకి కళ్లెం వేశారు. నోర్ట్జే, ఆవేష్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. రబాడ 4 ఓవర్లలో 21 పరుగులే ఇచ్చాడు. ధావన్ (39; 35 బంతుల్లో 3×4, 2×6), హెట్‌మెయర్ (28 నాటౌట్; 18 బంతుల్లో 2×4, 1×6) రాణించడం వల్ల లక్ష్యాన్ని దిల్లీ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శార్దూల్ (2/13), జడేజా (2/28) గొప్పగా బౌలింగ్ చేసినా ఫలితం లేకపోయింది.