ETV Bharat / sports

కోల్​కతాకు వరుణుడి షాక్.. D/L పద్ధతిలో పంజాబ్​ విజయం - ఐపీఎల్ 2023 కోల్​కతా ఓటమి

ఐపీఎల్ 2023లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.

Punjab Kings vs Kolkata Knight Riders 2nd Match
ఐపీఎల్ 2023
author img

By

Published : Apr 1, 2023, 8:02 PM IST

Updated : Apr 1, 2023, 8:38 PM IST

ఐపీఎల్ 2023లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 7 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం పడటం వల్ల డక్​ వర్త్​ లూయిస్​ (డీఎల్​ఎస్​) పద్ధతి ద్వారా విజేతను ప్రకటించారు. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్​.. 16ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. తర్వాత భారీ వర్షం కురవడం వల్ల ఆటను ఆపేశారు. మళ్లీ మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాకపోవడం వల్ల డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం పంజాబ్‌ కింగ్స్​ను విజేతగా ప్రకటించారు.

లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్​కు​ రెండో ఓవర్‌లోనే భారీ షాక్‌ తగిలింది. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో మన్‌దీప్‌ సింగ్ (2), అనుకుల్‌ రాయ్‌(4) ఔట్​ అయ్యారు. నిలకడగా ఆడుతున్న రెహ్మనుల్లాను(22) నాథన్‌ ఎల్లిస్‌ బౌలింగ్​లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆండ్రూ రస్సెల్ (35), వెంకటేశ్ అయ్యర్‌ (34), నితీశ్ రాణా(24) పరుగులు చేశారు. పంజాబ్​ బౌలర్లలో అర్షదీప్​ సింగ్​ 3 వికెట్లతో చెలరేగిపోయాడు. నాథన్ ఎల్లిస్​, సామ్ కరణ్​, సికందర్​ రాజా, రాహుల్ చాహర్​ తలో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్​ బ్యాటింగ్​కు దిగిన పంజాబ్ కింగ్స్​.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. భానుక రాజపక్స(50; 32 బంతుల్లో 5x4, 2x6) హాఫ్​ సెంచరీతో మెరిశాడు. ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్(23; 12 బంతుల్లో 2x4, 2x6), కెప్టెన్ శిఖర్ ధావన్(40; 29 బంతుల్లో 6x4), జితేశ్ శర్మ(21; 11 బంతుల్లో 1x4, 2x6), శామ్ కరన్(26*;17 బంతుల్లో 2x6) పరుగులతో రాణించారు. ఆఖర్లో క్రీజులోకి వచ్చిన షారుక్​ ఖాన్ (11*) రెండు ఫోర్లు, సికందర్ రజా(16) ఒక ఫోర్, ఒక సిక్స్​తో ఆకట్టుకున్నారు. మొత్తంగా పంజాబ్ జట్టు బ్యాటర్లతా దూకుడుగా భారీ షాట్లతో ఆకట్టుకున్నారు. కోల్​కతా నైట్ రైడర్స్ బౌలర్లలో టిమ్ సౌథీ 2 వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు.

అరుదైన రికార్డు.. శిఖర్​ ధావన్​ తన పేరిట ఓ అరుదైన రికార్డును లిఖించుకున్నాడు. ఈ ఐపీఎల్‌ చరిత్రలో అత్యధికసార్లు 50 ప్లస్‌ భాగస్వామ్యాలు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో అతడికిది 94వ అర్ధశతక భాగస్వామ్యం కావడం విశేషం. దీంతో అతడు విరాట్​ కోహ్లీ రికార్డును సమం చేశాడు. రాయల్​ ఛాలెంజర్స్​ తరఫున విరాట్​ కూడా 94 అర్ధశతక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. వీరిద్దరి తర్వాత సురేశ్‌ రైనా 83 అర్ధశతక భాగస్వామ్యాలు, డేవిడ్‌ వార్నర్‌ 82 అర్ధశతక భాగస్వామ్యాలతో కొనసాగుతున్నారు.

ఇదీ చూడండి: IPL 2023: ఒకే ఫ్రేమ్​లో ఇద్దరు దిగ్గజాలు.. స్టన్నింగ్​ క్యాచ్​తో మెరిసిన ఛెత్రి

Last Updated : Apr 1, 2023, 8:38 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.