ETV Bharat / sports

IPL 2023: ఆర్సీబీ హవా మామూలుగా లేదుగా.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్​లు వాళ్లవే! - ఐపీఎల్​ 2023 స్థానం

ఐపీఎల్​ 16వ సీజన్​లో ఆర్సీబీ హవా మామూలుగా లేదు!.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్‌లో ఆ టీమ్​ ప్లేయర్సే టాప్​లో ఉన్నారు. ఆ వివరాలు..

ipl 2023 points table rcb moves to fifth place orange purple caps holders rcb players

author img

By

Published : Apr 21, 2023, 12:58 PM IST

ఐపీఎల్​ 16వ సీజన్​ రసవత్తరంగా సాగుతోంది. ప్రతీ మ్యాచ్​లో క్రికెట్​ అభిమానులకు కావాల్సినంత మజా లభిస్తుంది. అరంగ్రేటంలోనే కొత్త కుర్రాళ్లు దుమ్మరేపుతున్నారు. అయితే గురువారం.. లీగ్​లో భాగంగా రెండు మ్యాచ్​లు జరిగాయి. ఇది వరకు వీకెండ్​లోనే డబుల్​ హెడర్​ ఉండగా.. కొన్ని కారణాల వల్ల గురువారం కూడా రెండు మ్యాచ్​లు జరిగాయి. అయితే ఈ మ్యాచ్​ల తర్వాత పాయింట్ల టేబుల్​, ఆరెంజ్​, పర్పుల్​ క్యాప్​ లీడర్లలో చాలా మార్పులు వచ్చాయి. ఒక్క మ్యాచ్​తోనే రాయల్​ ఛాలెంజర్స్​ జట్టు.. ఓ రేంజ్​లో సత్తా చాటింది. పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో విజయం సాధించి.. పాయింట్ల టేబుల్​లో ఐదో స్థానానికి దూసుకెళ్లింది. అంతే కాదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లీడర్లుగా ఆర్సీబీ టీమ్ ప్లేయర్స్ టాప్​లో నిలిచారు.

పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్ లో 24 పరుగుల తేడాతో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్.. ఐదో స్థానానికి వెళ్లింది. ప్రస్తుతం ఆర్సీబీ ఆరు మ్యాచ్​లలో మూడు విజయాలు, మూడు పరాజయాలతో 6 పాయింట్లు సాధించింది. ఆ టీమ్ నెట్ రన్‌రేట్ నెగటివ్​గా ఉండటం వల్ల సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ కంటే కింద ఉంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఏడో స్థానానికి పడిపోగా.. రెండో మ్యాచ్​లో ఓడిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఎనిమిదో స్థానంలోలో, సీజన్​లో తొలి విజయం సాధించిన దిల్లీ క్యాపిటల్స్ పదో స్థానంలోనే కొనసాగుతున్నాయి.

ipl 2023 points table rcb moves to fifth place orange purple caps holders rcb players
పాయింట్ల టేబుల్​

ఇక అత్యధిక పరుగుల వీరుడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్​లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టాప్​లోకి దూసుకెళ్లాడు. డుప్లెసిస్​ ఆరు మ్యాచ్​లలో 343 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. అతడి స్ట్రైక్ రేట్ 166.5 కావడం విశేషం. పంజాబ్ కింగ్స్​తో మ్యాచ్​లో 56 బంతుల్లోనే 84 రన్స్ చేసిన డుప్లెసిస్​.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు!

ఆరెంజ్​ క్యాప్​

అటు ఈ మ్యాచ్​లో ఆర్సీబీ కెప్టెన్​గా చేసిన విరాట్ కోహ్లీ 279 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. గురువారం జరిగిన రెండో మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వార్నర్ 285 పరుగులతో రెండో స్థానానికి దూసుకెళ్లాడు.

సిరాజ్​, డుప్లెసిస్​

అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్​కు ఇచ్చే పర్పుల్ క్యాప్​లో ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ టాప్​లోకి వెళ్లడం విశేషం. పంజాబ్ కింగ్స్​తో మ్యాచ్​లో నాలుగు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్​గా నిలిచిన సిరాజ్.. 12 వికెట్లతో ఈ లిస్టులో టాప్​లో ఉన్నాడు. లఖ్​నవూ సూపర్ కింగ్స్ బౌలర్ మార్క్ వుడ్, రాజస్థాన్ బౌలర్ యుజువేంద్ర చాహల్, గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్ ముగ్గురూ తలా 11 వికెట్లతో రెండు, మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు. గుజరాత్ టైటాన్స్​కే చెందిన మహ్మద్ షమీ 10 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.

పర్పుల్​ క్యాప్​

కోహ్లీ అరుదైన ఘనత..
పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో స్టార్​ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. టీ20 చరిత్రలో​ జట్టు కెప్టెన్​గా 6500 పరుగులు మైలురాయిని అందుకున్నాడు. దాంతో పాటు లీగ్​లో 600 ఫోర్లు బాదిన మూడో క్రికెటర్​గా రికార్డుకెక్కాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.