ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవరల్లో వికెట్ల నష్టానికి 212 పరుగులు సాధించింది. ప్రత్యర్థి లఖ్‌నవూకు 213 భారీ పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, మాక్స్వెల్ దుమ్మురేపారు. హాఫ్ సెంచరీలతో మెరిశారు. లఖ్‌నవూ బౌలర్లలో అమిత్ మిశ్రా, మార్క్‌వుడ్ తలో ఒక్క వికెట్ తీశారు.
టాస్ ఓడిన బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ శుభారంభం చేశారు. ఆరంభం నుంచి దూకుడుగా ప్రతీ ఓవర్లోనూ పరుగులు రారాజు విరాట్ అదరగొట్టాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కానీ అమిత్ మిశ్రా వేసిన 12 ఓవర్లో మూడో బంతికి స్టాయినిస్‌కు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లీ (61) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి గ్లెన్ మాక్స్వెల్ వచ్చాడు. డుప్లెసిస్, మాక్స్వెల్ ఇద్దరూ కలిసి చెలరేగిపోయారు. లఖ్‌నవూ బౌలర్లు వేసిన బంతులకు బౌండరీలు బాది దుమ్ముదులిపారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. లఖ్‌నవూ బౌలర్లకు ముప్పతిప్పలు పెట్టిన గ్లెన్ మాక్స్వెల్(59) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ క్రీజులోకి వచ్చాడు. దినేశ్(1), డుప్లెసిస్(79*) నాటౌట్‌గా నిలిచారు.
కోహ్లీ హాఫ్ సెంచరీ..
ఐపీఎల్ 16వ సీజన్లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. లీగ్ చరిత్రలో ఇప్పటివరకు.. విరాట్ 46 అర్ధ శతకాలు బాదేశాడు. టీ20 కెరీర్లో అతడికి ఇది 87వ హాఫ్ సెంచరీ.
డుప్లెసిస్ అరుదైన రికార్డు..
ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అరుదైన రికార్డు సాధించాడు. లీగ్ చరిత్రలో 3500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మ్యాక్సీ హాఫ్ సెంచరీ
మ్యాక్స్‌వెల్ చెలరేగి ఆడాడు. వరుసగా సిక్సర్లు బాదుతూ లఖ్‌నవూ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అవేశ్ ఖాన్ వేసిన 19 ఓవర్‌లో మొదటి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
1.8 కోట్లు మంది..
లఖ్‌నవూ- బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను భారీగా అభిమానులు చూస్తున్నారు. బెంగళూరు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 1.8 కోట్ల మంది మ్యాచ్‌ను వీక్షించారు. లీగ్ చరిత్రలో ఇదే హైయెస్ట్ వ్యూయర్ షిప్!
ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు ప్లేయర్ల హాఫ్ సెంచరీలు..
ఈ మ్యాచ్‌లో బెంగళూరు ప్లేయర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్ హాఫ్ సెంచరీలు బాదేశారు. అయితే లీగ్ చరిత్రలో ఇలా జరగడం ఇది ఐదో సారి మాత్రమే. ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరిగిందంటే?
- మహేల (55), సెహ్వాగ్ (73) & పీటర్సన్ (50*).. దిల్లీ vs ముంబయి(2012)
- వార్నర్ (51), శిఖర్ (77), విలియమ్సన్ (54*).. సన్‌రైజర్స్ vs పంజాబ్ (2017)
- గిల్ (76), లిన్ (54), రస్సెల్ (80*).. కోల్‌కతా vs ముంబయి (2019)
- జైస్వాల్ (54), బట్లర్ (54), శాంసన్ (55).. రాజస్థాన్ vs సన్‌రైజర్స్ (2023)
- కోహ్లి (61), డు ప్లెసిస్ (71*), మాక్స్వెల్ (52*).. బెంగళూరు vs లఖ్‌నవూ (2023)
- ఇవీ చదవండి:
- సింపుల్‌గా దిల్లీ ఆల్‌రౌండర్ పెళ్లి.. ఫొటోలు చూశారా?
- మళ్లీ ప్రేమలో పడ్డ శిఖర్ ధావన్.. నెట్టింట వీడియో వైరల్!