ETV Bharat / sports

కోల్​కతా బౌలర్లు రాక్​​​.. 'క్లీన్​ బౌల్డ్'​ మాయాజాలానికి RCB స్టార్​ ప్లేయర్లు షాక్​! - వరుణ్​ చక్రవర్తి అప్డేట్స్

కోల్​కతా బౌలర్లు తమ బౌలింగ్​ స్కిల్స్​తో ఆర్సీబీ ప్లేయర్లను హడలెత్తించారు. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఆ వీడియోను మీరు కూడా ఓ సారి చూసేయండి.

ipl-2023-kkr-vs-rcb-kohli-duplessis-maxwell-harshal-clean-bowled-video-

author img

By

Published : Apr 7, 2023, 3:00 PM IST

Updated : Apr 7, 2023, 3:19 PM IST

ఐపీఎల్ 16వ సీజన్​లో భాగంగా గురువారం ఆర్సీబీ- కొల్​కతా మధ్య జరిగిన పోరులో కోల్‌కతా స్పిన్నర్లు.. తమ బౌలింగ్​ స్కిల్స్​తో మైదానంలో చెలరేగిపోయారు. మిస్టరీ స్పిన్నర్లైన సునీల్‌ నరైన్‌ (4-0-16-2), వరుణ్‌ చక్రవర్తి (3.4-0-15-4), సుయాశ్‌ శర్మ (4-0-30-3) గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరు మైదానంలోకి దిగి ఆర్సీబీని చిత్తు చేసిన తీరుకు అభిమానులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు.

ముఖ్యంగా సునీల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి.. విరాట్‌ కోహ్లీ, డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌, హర్షల్‌ పటేల్‌లను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన తీరు మ్యాచ్​లో హైలైట్‌ నిలిచింది. నరైన్‌ బౌలింగ్‌లో కోహ్లీ, వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో డుప్లెసిస్‌ ఒకే తరహాలో క్లీన్‌ బౌల్డ్‌ కాగా.. మరోసారి చక్రవర్తి బౌలింగ్‌లో మ్యాక్సీ, హర్షల్‌ పటేల్‌ కూడా అలాగే బౌల్డ్‌ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ ముగ్గురి దూకుడుకి ఆర్సీబీ హడల్​..
తొలుత బ్యాటింగ్​కు దిగిన కోల్‌కతా.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు స్కోర్​ చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో ఆర్సీబీ విఫలమైంది. 17.4 ఓవర్లలోనే 123 పరుగుల స్కోర్​ చేసి ఆలౌట్ అయ్యింది. 205 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టుకున్న ఆర్సీబీ.. దాన్ని ఛేదించలేకపోయింది. తొలి ఓవర్లలలోనే ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడినప్పటికీ వికెట్లు పడుతున్న కొద్దీ వారి ప్రదర్శన తగ్గుముఖం పట్టింది.

ఇక కావాల్సిన రన్‌ రేట్‌ను సాధించడానికి ఆర్సీబీ బ్యాటర్లు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. అయితే ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్‌ మొత్తాన్నీ ఛిన్నాభిన్నం చేశారు కోల్‌కతా స్పిన్నర్లు.. వరుణ్ చక్రవర్తి, సుయాశ్​ శర్మ, సునీల్ నరైన్. వరుణ్ చక్రవర్తి 3.4 ఓవర్లల్లో 15 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టగా.. సుయాశ్​ శర్మ నాలుగు ఓవర్లల్లో 30 పరుగులకు మూడు వికెట్లు తీశాడు. ఇక సునీల్ నరైన్ నాలుగు ఓవర్లలో 16 పరుగులకు గాను 2 వికెట్లను కూల్చాడు.

మరోవైపు కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో శార్దుల్‌ ఠాకూర్‌ 29 బంతుల్లో 68 రన్స్​ స్కోర్​ చేశాడు. అందులో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు కొట్టాడు. ఇక గుర్బాజ్‌ 44 బంతుల్లో 57 స్కోర్​ చేశాడు. అందులో 6 ఫోర్లు, 3 సిక్స్‌లే ఉన్నాయి. ఇక రింకూ సింగ్‌ అయితే 33 బంతుల్లో 46 స్కోర్​ సాధించాడు. 2 ఫోర్లు, 3 సిక్స్‌లను బాది అదరగొట్టాడు. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్‌ విల్లీ, కరణ్‌ శర్మలు చెరో 2 వికెట్లను పడగొట్టారు.

Last Updated : Apr 7, 2023, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.