ETV Bharat / sports

IPL 2023: దుమ్మురేపిన శార్దూల్​, గుర్బాజ్​.. RCB టార్గెట్​ ఫిక్స్​.. ఎంతంటే?

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా.. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. అయితే బెంగళూరుకు కోల్​కతా నిర్దేశించిన లక్ష్యం ఎంతంటే?

ipl 2023 kkr rcb match rcb target runs
ipl 2023 kkr rcb match rcb target runs
author img

By

Published : Apr 6, 2023, 9:21 PM IST

Updated : Apr 6, 2023, 9:33 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో భాగంగా రాయల్​ ఛాలెంజర్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో కోల్​కతా నైట్​ రైడర్స్ జట్టు ఇన్నింగ్స్​ ముగిసింది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు సాధించింది. బెంగళూరుకు పరుగుల 205 లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్​కతా బ్యాటర్లలో శార్దూల్​ ఠాకూర్(68)​, రహ్మనుతుల్లా గుర్బాజ్(57) అదరగొట్టారు. అర్ధ సెంచరీలతో మెరిశారు. మరో బ్యాటర్​ రింకూ సింగ్​ తప్ప మిగతావారంతా విఫలమయ్యారు. బెంగుళూరు బౌలర్లలో డేవిడ్​ విల్లే, కర్ణ్​ శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టారు. బ్రాస్​ వెల్ ఒక్క వికెట్​ తీశాడు.

టాస్‌ ఓడిన కోల్‌కతా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా వెంకటేశ్ అయ్యర్, రహ్మనుతుల్లా గుర్బాజ్ శుభారంభం చేశారు. అయితే ఆరంభంలోనే కోల్‌కతాకు ఎదురుదెబ్బ తగిలింది. డేవిడ్ విల్లే వరుస బంతుల్లో (3.2, 3.3వ ఓవర్‌) రెండు వికెట్లు తీశాడు. తొలుత వెంకటేశ్‌ అయ్యర్ (3).. తర్వాత మన్‌దీప్‌ (0)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. 26 పరుగుల వద్దే కోల్‌కతా రెండు వికెట్లను చేజార్చుకుంది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ నితీశ్ రాణా (1) మరోసారి నిరాశపరిచాడు. బ్రాస్‌వెల్‌ బౌలింగ్‌లో స్వీప్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి కీపర్ కార్తిక్‌ చేతికి చిక్కాడు. తొలుత అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించగా.. ఆర్‌సీబీ డీఆర్‌ఎస్‌ తీసుకుని సఫలమైంది.

తర్వాత ఆరంభం నుంచి అద్భుతంగా ఆడిన రహ్మతుల్లా గుర్బాజ్‌ (57) పెవిలియన్‌కు చేరాడు. కర్ణ్ శర్మ బౌలింగ్‌లో ఆకాశ్‌ దీప్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు. హార్డ్‌ హిట్టర్‌ ఆండ్రూ రస్సెల్‌ (0) డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. కర్ణ్‌ శర్మ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే భారీ షాట్‌కు యత్నించి లాంగాఫ్‌లో కోహ్లీ చేతికి చిక్కాడు. తర్వాత వచ్చిన రింకు సింగ్‌ (46) అర్ధశతకం చేజార్చుకున్నాడు. హర్షల్‌ పటేల్ బౌలింగ్‌లో చివరి బంతికి కీపర్ కార్తిక్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి రింకు పెవిలియన్‌కు చేరాడు. ఆరంభం నుంచి అదరగొట్టిన శార్దూల్‌ ఠాకూర్ (68) భారీ షాట్‌కు యత్నించి మ్యాక్స్‌వెల్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. సునీల్​ నరైన్​, ఉమేశ్​ యాదవ్​ నాటౌట్​గా నిలిచారు.

గుర్బాజ్​ అరుదైన రికార్డు..
ఈ మ్యాచ్​లో కోల్​కతా ఓపెనర్​ రహ్మనుతుల్లా గుర్బాజ్(57) దుమ్మరేపాడు. వరుస షాట్లతో అలరించి హాఫ్​ సెంచరీ బాదేశాడు. దీంతో లీగ్​ చరిత్రలో అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్​ చరిత్రలో హాఫ్​ సెంచరీ సాధించిన తొలి అఫ్గానిస్థాన్​ ప్లేయర్​గా రికార్డుకెక్కాడు.

కెరీర్​లో తొలి హాఫ్​ సెంచరీ..
కోల్​కతా ప్లేయర్​ శార్దూల్‌ ఠాకూర్ (51*) కేవలం 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ను దాటాడు. హర్షల్‌ పటేల్ వేసిన ఈ ఓవర్‌లో ఫోర్‌తో అర్ధశతకం పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో ఇదే అతడి తొలి హాఫ్‌ సెంచరీ.

Last Updated : Apr 6, 2023, 9:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.