IPL 2022 SRH vs RCB: ఐపీఎల్ మెగా లీగ్‌లో బెంగళూరు మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 16.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. దీంతో హైదరాబాద్‌కు 69 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇచ్చింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచే బెంగళూరు వికెట్ల పతనం ప్రారంభమైంది. హైదరాబాద్ బౌలర్ మార్కో మాన్‌సెన్ (3/25) ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి బెంగళూరు కుప్పకూలడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత నటరాజన్ (3/10) విజృంభించాడు. వీరితోపాటు సుచిత్ (2/12), ఉమ్రాన్ మాలిక్ (1/13), భువనేశ్వర్ (1/8) చెలరేగడంతో బెంగళూరు కోలుకోలేకపోయింది.
టాప్‌ఆర్డర్ డౌన్: హైదరాబాద్ బౌలర్ల ధాటికి బెంగళూరు బ్యాటర్లు బెంబేలెత్తారు. పవర్ ప్లేలో బెంగళూరు నాలుగు వికెట్ల నష్టానికి 31 పరుగులు మాత్రమే చేసింది.జాన్‌సెన్ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీయగా.. నటరాజన్ బౌలింగ్‌లో విలియమ్సన్ చేతికి క్యాచ్ ఇచ్చి మ్యాక్స్‌వెల్ (12) పెవిలియన్‌కు చేరాడు. దీంతో టాప్‌ఆర్డర్ కుప్పకూలింది.
ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు: ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు.. అందులో ఒకరు టాప్ బ్యాటర్ గోల్డెన్ డక్ కాగా.. మంచి ఫామ్‌లో ఉన్న ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్‌కు చేరారు. డుప్లెసిస్ (5), అనుజ్ రావత్ (0), విరాట్ కోహ్లీ (0)ను ఒకే ఓవర్‌లో హైదరాబాద్ బౌలర్ మార్కో జాన్‌సెన్ ఔట్ చేసి సంచలనం సృష్టించాడు. డుప్లెసిస్‌ను బౌల్డ్ చేయగా.. మిగతా ఇద్దరు మార్‌క్రమ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు చేరారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 12, ప్రభుదేశాయ్ 15, హసరంగ 8, షాహ్‌బాజ్ 7, డుప్లెసిస్ 5, హర్షల్ పటేల్ 4, హేజిల్‌వుడ్ 3*, సిరాజ్ 2 పరుగులు మాత్రమే చేశారు.
ఇదీ చూడండి: గుజరాత్ బౌలర్లు భళా.. ఉత్కంఠ పోరులో కేకేఆర్‌పై విజయం