ETV Bharat / sports

Ravi Shastri: 'చెన్నై కెప్టెన్‌గా అతడిని నియమించాల్సింది' - ఫాఫ్ డుప్లెసిస్‌

IPL 2022 Ravi Shastri CSK: ఐపీఎల్​ 2022లో వరుస ఓటములతో అభిమానులను నిరూత్సపరుస్తోంది డిఫెండింగ్​ ఛాంపియన్స్​ చెన్నై సూపర్ కింగ్స్. ఈ సీజన్​తోనే సారథిగా తప్పుకొన్న ధోనీ.. జట్టు పగ్గాలను జడేజాకు అప్పగించాడు. అయితే కెప్టెన్సీ మార్పు ఫలితాన్ని ఇవ్వకపోవడం పట్ల టీమ్​ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఫాఫ్​ డుప్లెసిస్​ను రిటెయిన్​ చేసుకొని ఉండి.. అతడిని కెప్టెన్​గా నియమించాల్సిందని అభిప్రాయపడ్డాడు.

ravi shastri csk
IPL 2022
author img

By

Published : Apr 11, 2022, 6:03 PM IST

IPL 2022 Ravi Shastri CSK: ఈ సీజన్‌లో చెన్నై జట్టు రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా చేసి తప్పు చేసిందని, అతడికి బదులు మాజీ ఓపెనర్‌ ఫాఫ్ డుప్లెసిస్‌ను అట్టిపెట్టుకొని కెప్టెన్‌గా నియమించాల్సిందని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం జరుగుతోన్న మెగా టోర్నీలో ఆ జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివర్లో కొనసాగుతోంది. శనివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓటమిపాలైన నేపథ్యంలో ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన శాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు.

ravi shastri csk
డుప్లెసిస్‌

"జడేజా లాంటి ఆటగాడు తన ఆటపై దృష్టిసారించాలని నేను అనుకుంటున్నా. స్టార్‌ ప్లేయర్‌ డుప్లెసిస్‌ను చెన్నై వదులుకోవాల్సింది కాదు. ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్న సమయంలో.. జడేజాకు బదులుగా డుప్లెసిస్‌కు ఆ బాధ్యతలు అప్పగించి ఉంటే బాగుండేది. జడేజా తన ఆటపైనే దృష్టిపెట్టేవాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా తన సహజసిద్ధమైన ఆట కొనసాగించేవాడు. అలా చేసుంటే చెన్నై పరిస్థితి మరోలా ఉండేది" అని శాస్త్రి వివరించాడు. కాగా.. ఈ సీజన్‌ ప్రారంభానికి రెండు రోజుల ముందే ధోనీ కెప్టెన్సీ వదులుకున్నాడు.

ఇదీ చూడండి:

ఐపీఎల్​లో హైదరాబాద్​ బోణీ.. చెన్నై నాలుగో ఓటమి

గతేడాది ఆరెంజ్​ క్యాప్​​.. ఈసారి 20 పరుగులు కూడా చేయలేక..!

ఊతప్ప ఎంపికపై ధోనీ షాకింగ్​ కామెంట్స్​.. ఏమన్నాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.