IPL 2022: టీ20 మెగా టోర్నీలో ఇప్పటి వరకు బోణీ కొట్టని ముంబయి జట్టు.. పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ముంబయి ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. అన్నింట్లోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, రెండు ఓటములతో ఏడో స్థానంలో ఉంది. పొట్టి ఫార్మాట్లో ముంబయి, పంజాబ్ జట్లు హెడ్ టు హెడ్ తలపడిన మ్యాచుల్లో 15-13 విజయాలతో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్‌లో ఏ జట్టు ఆధిపత్యం చెలాయిస్తుందో చూడాలి.!
తుది జట్ల వివరాలు..
ముంబయి : ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవీస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, జయదేవ్ ఉనద్కత్, టైమల్ మిల్స్, బాసిల్ తంపి.
పంజాబ్ : మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో, లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా.
ఇదీ చూడండి: రోహిత్ తను 'హిట్‌మ్యాన్' అని గుర్తుపెట్టుకోవాలి: సెహ్వాగ్