చివర్లో తడబడిన గుజరాత్
IPL 2022: కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లు ఆకట్టుకోలేకపోయినప్పటికీ హార్దిక్ పాండ్యా మరోమారు కెప్టెన్ ఇన్సింగ్స్ ఆడి జట్టును ముందుకు నడిపించాడు. పాండ్యాకు మిల్లర్ తోడవటం వల్ల భారీ స్కోర్ సాధిస్తుందని భావించారు. అయితే.. చివరి ఓవర్లో 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి భారీ స్కోర్‌కు అడ్డుకట్ట వేశాడు కోల్‌కతా బౌలర్ ఆండ్రీ రసెల్.
హార్దిక్ పాండ్యా 49 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 67 పరుగులు చేసి సౌథీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. డేవిడ్ మిల్లర్ 20 బంతుల్లో 27, వృద్ధిమాన్ సాహా 25 బంతుల్లో 25 పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లు రెండంకెల స్కోర్ సాధించలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో టీమ్ సౌథీ 3, రసెల్ 4 వికెట్లు పడగొట్టారు.