ETV Bharat / sports

'యువీ వికెట్​తో నా జీవితమే మారిపోయింది'

IPL 2022 Dwayne Bravo Record: భారత్​తో మ్యాచ్​లో జరిగిన ఆసక్తికర అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు వెస్టిండీస్​ మాజీ ఆటగాడు, చెన్నై సూపర్​కింగ్స్​ స్టార్​ బౌలర్​ డ్వేన్​ బ్రావో. టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ను ఔట్ చేయడం వల్ల తన జీవితమే మారిపోయిందన్నాడు. మరోవైపు ఐపీఎల్​లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా బ్రావో రికార్డు సృష్టించాడు.

IPL 2022
Dwayne Bravo Record
author img

By

Published : Apr 1, 2022, 7:52 AM IST

IPL 2022 Dwayne Bravo Record: టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ను ఔట్ చేయడం వల్ల తన జీవితమే మారిపోయిందన్నాడు వెస్టిండీస్ మాజీ కెప్టెన్​ డ్వేన్ బ్రావో. తాజాగా ఓ వార్తా సంస్థతో మాట్లాడిన అతడు 2006లో జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్​లో భాగంగా చెన్నై జట్టు తరఫున ఆడుతున్నాడు.

జమైకాలో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత అదే మైదానంలో జరిగిన రెండో వన్డేలో ఒక పరుగు తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఆ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 9 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన భారత్‌ 197 పరుగులకు ఆలౌటైంది. టీమ్‌ఇండియా విజయానికి 10 పరుగులు అవసరమైన సమయంలో.. ఆఖరి ఓవర్లో రెండు, మూడు బంతులను యువరాజ్‌ సింగ్ బౌండరీకి తరలించి సమీకరణాన్ని మూడు బంతుల్లో రెండు పరుగులుగా మార్చేశాడు. కానీ, దురదృష్టవశాత్తు నాలుగో బంతికి యువరాజ్‌ బౌల్డయ్యాడు. దీంతో భారత్‌కి ఓటమి తప్పలేదు.

"టీమ్ఇండియా అప్పటికే తొమ్మిది వికెట్లు కోల్పోయి.. విజయానికి రెండు పరుగుల దూరంలో ఉంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యువరాజ్‌ సింగ్ (93) ఉన్నాడు. అలాంటి ఉత్కంఠ పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ చేయాలో అర్థం కాలేదు. ఆఖరికి డిప్పర్ బంతితో యువరాజ్‌ను ఔట్ చేయడం వల్ల అందరి దృష్టి నాపై పడింది. ఆ ఒక్క బంతితో నా జీవితమే మారిపోయింది. నా టీ20 కెరీర్‌కు పునాదిగా నిలిచింది. నా జీవితాన్ని మలుపు తిప్పిన ఆ బంతే ఇప్పటికీ నా ఫేవరెట్"

-డ్వేన్ బ్రావో, వెస్టిండీస్ ఆల్​రౌండర్​

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2006లో కెప్టెన్‌ రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో భారత జట్టు వెస్టిండీస్‌లో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా విండీస్‌తో ఐదు వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచుల్లో తలపడింది. 1-4 తేడాతో వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమ్‌ఇండియా.. టెస్టు సిరీస్‌ను 1-0 ఆధిక్యంతో సొంతం చేసుకుంది.

IPL 2022 news
వికెట్​ తీసిన ఆనందంలో డ్వేన్ బ్రావో

ఐపీఎల్​లో బ్రావో రికార్డు: డ్వేన్‌ బ్రావో ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో సరికొత్త రికార్డును సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రావో.. ఐపీఎల్​ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా రికార్డును నెలకొల్పాడు. లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో దీపక్‌ హుడా వికెట్​ తీసిన బ్రావో.. ఐపీఎల్‌లో అత్యధికంగా 171 వికెట్లు సాధించాడు.

అంతకుముందు ముంబయి ఇండియన్స్‌ మాజీ బౌలర్‌ లసిత్‌ మలింగ (170) పేరిట ఈ రికార్డు ఉంది. ఐపీఎల్​ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బ్రావో, మలింగ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో అమిత్‌ మిశ్రా (166), పీయుష్‌ చావ్లా (157), హర్భజన్‌ సింగ్‌ (150) ఉన్నారు.

ఇదీ చదవండి: IPL 2022 : లఖ్​నవూ సూపర్ జెయింట్స్​ బోణీ... చెన్నైపై 6 వికెట్ల తేడాతో గెలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.