ETV Bharat / sports

ముంబయితో పోరు.. సన్​రైజర్స్ లక్ష్యం 151 - సన్​రైజర్స్ వర్సెస్ ముంబయి లైవ్ స్కోర్ట

చెన్నై వేదికగా సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరుగుతోన్న మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన ముబయి ఇండియన్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 150 పరుగులు చేసింది. పొలార్డ్ (35), డికాక్ (40) మెరిశారు.

IPL
ఐపీఎల్
author img

By

Published : Apr 17, 2021, 9:13 PM IST

సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరుగుతోన్న మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్​మెన్ తడబడ్డారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయికి అదిరిపోయే శుభారంభం దక్కింది. కెప్టెన్ రోహిత్ (32), డికాక్ (40) సూపర్ ఫాస్ట్ ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి ధాటికి మొదటి 6 ఓవర్లలోనే 53 పరుగులు లభించాయి. ఆ తర్వాత విజయ్ శంకర్ వేసిన ఓవర్లో భారీ షాట్ ఆడబోయి క్యాచ్​ ఇచ్చి పెవిలియన్ చేరాడు హిట్​మ్యాన్. కాసేపు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించిన డికాక్​ను ముజిబుర్ రెహ్మన్ ఔట్ చేశాడు, సూర్య కుమార్ (10), ఇషాన్ కిషన్ (12) తొందరగానే ఔటయ్యారు.

చివర్లో సన్​రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. దీంతో ముంబయి బ్యాట్స్​మెన్ పరుగులు చేయడానికి కష్టపడ్డారు. క్రీజులో పొలార్డ్, హార్దిక్ పాండ్యాలాంటి హిట్టర్లున్నా స్కోర్ బోర్డు నెమ్మదిగా కదలసాగింది. 15 ఓవర్ నుంచి 19 ఓవర్ల వరకు ఐదు ఓవర్లలో 35 పరుగులు మాత్రమే లభించాయి. 19 ఓవర్లో పాండ్యా (7) వెనుదిరగడం వల్ల పొలార్డ్​తో కలిశాడు కృనాల్ పాండ్యా. చివరి ఓవర్లో పొలార్డ్ రెండు సిక్సులు బాదడం వల్ల ముంబయి స్కోర్​ 150 పరుగులకు చేరింది. పొలార్డ్ (35) పరుగులతో నాటౌట్​గా నిలిచాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.