ఐపీఎల్ రెండోదశలో(IPL 2nd League 2021) వ్యాఖ్యాతలుగా వ్యవహించనున్న వారి పేర్లను ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. ఇంగ్లీష్, హిందీ భాషల్లో కామెంటరీ(IPL Commentators) చేయనున్న వారి పేర్లను వెల్లడించింది. ఆంగ్లంలో హర్ష భోగ్లే, సునీల్ గావస్కర్, నిక్ నైట్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, ఇయాన్ బిషప్ ఉన్నారు. హిందీ కామెంటేటర్స్ ప్యానెల్లో గౌతమ్ గంభీర్, పార్థివ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్, ఆకాశ్ చోప్రా ఉన్నారు.
ఐపీఎల్ 14వ సీజన్(IPL 14 Season) ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైనప్పటికీ.. కరోనా కేసులు నమోదైన కారణంగా మే 4న టోర్నీ వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే టోర్నీలో ఆగిపోయిన మ్యాచ్‌లను యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ప్రారంభించనట్లు వెల్లడించింది. ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను యూఏఈ చేర్చగా.. వారంతా ప్రాక్టీస్ మొదలెట్టేశారు.
ఐపీఎల్ 14వ సీజన్ పాయింట్ల పట్టికలో(IPL Points Table 2021) దిల్లీ క్యాపిటల్స్ జట్టు.. 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఉన్నాయి. ఈ సీజన్లో ఇరుజట్లు 7 మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లు సాధించాయి.
ఇంగ్లీష్ కామెంటేటర్స్ ప్యానెల్..
హర్ష భోగ్లే, సునీల్ గావస్కర్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, మురళీ కార్తిక్, దీప్ దాస్‌గుప్తా, అంజుమ్ చోప్రా, ఇయాన్ బిషబ్, అలన్ విల్కిన్స్, పుమెలీలో మబాంగ్వా, నికోలస్ నైట్, డానీ మోరిసన్, సిమోన్ డౌల్, మ్యాథ్యూ హెడెన్, కెవిన్ పీటర్సన్.
హిందీ కామెంటేటర్స్ ప్యానెల్..
జతిన్ సప్రు, సురెన్ సుందరమ్, ఆకాశ్ చోప్రా, నిఖిల్ చోప్రా, తన్యా పురోహిత్, ఇర్ఫాన్ పఠాన్, గౌతమ్ గంభీర్, పార్థివ్ పటేల్, కిరణ్ మొరే.
ఇదీ చూడండి.. 'అశ్విన్ చేరికతో అత్యుత్తమ జట్టుగా టీమ్ఇండియా!'