ఐపీఎల్ రెండో దశలో(IPL 2021) వరుస అపజాయలతో సతమతమతున్న ఇద్దరు స్టార్ కెప్టెన్ల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మరి కాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్(RCB Vs MI) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ముందుగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబయి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ బ్యాటింగ్కు దిగనుంది.
టోర్నీలో ఇరుజట్లు ఇప్పటికే 9 మ్యాచ్లు ఆడగా.. 5 మ్యాచ్ల్లో గెలిచిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో(IPL Points Table 2021) మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు ముంబయి ఇండియన్స్ 4 మ్యాచ్ల్లో నెగ్గి.. 6వ స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్లో నెగ్గి ఐపీఎల్ ప్లేఆఫ్స్(IPL Playoffs 2021) రేసులో ముందుకెళ్లాలని ఇరు జట్లు ప్రణాళికలను రచిస్తున్నాయి. మరి ఈ పోరులో గెలిచేదెవరో చూడాలి.
ఇదీ చూడండి: IPL 2021: బెంగళూరు-ముంబయి.. గెలుపుబాట పట్టేదెవరు?