ETV Bharat / sports

తేలిపోయిన పంజాబ్​.. హైదరాబాద్​ లక్ష్యం 121 - హైదరాబాద్​ వర్సెస్​ పంజాబ్​ ఐపీఎల్ 2021

సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరుగుతున్న మ్యాచ్​లో టాస్​ గెలిచి బ్యాటింగ్​ చేసిన పంజాబ్​ కింగ్స్ జట్టు.. 120 పరుగులకే కుప్పకూలిపోయింది. ప్రారంభం నుంచి తడబడుతూ బ్యాటింగ్​ చేసిన పంజాబ్​లో.. బ్యాట్స్​మెన్​ మయాంక్​ అగర్వాల్​(22), షారుక్​​ ఖాన్​(22) తప్ప ఎవ్వరూ ఆకట్టుకోలేకపోయారు.

SRH Vs PBKS
సన్​రైజర్స్​ హైదరాబాద్​
author img

By

Published : Apr 21, 2021, 5:25 PM IST

Updated : Apr 21, 2021, 6:15 PM IST

చెన్నై వేదికగా సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరుగుతున్న మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్ జట్టు బ్యాటింగ్​లో తడబడింది. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి 120 పరుగులకే కుప్పకూలింది. దీంతో 121 రన్స్​ లక్ష్యం వార్నర్​సేన ముందుంది. ఆరంభంలో మయాంక్​ ఆగర్వాల్​ ఆచితూచి బ్యాటింగ్​ చేసినా.. ఆ తర్వాత వచ్చిన వారు స్కోరుబోర్డును పరుగులు పెట్టించడంలో విఫలమయ్యారు. హైదరాబాద్​ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి పంజాబ్​ బ్యాట్స్​మెన్​ను పెవిలియన్​కు పంపారు.

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న పంజాబ్​ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్​ కుమార్​ వేసిన రెండో ఓవర్​లో కెప్టెన్​ కేఎల్​ రాహుల్​(4) ఔట్​ అయ్యాడు. మరో ఓపెనర్​ మయాంక్ అగర్వాల్​ ఆచితూచి బ్యాటింగ్ చేసినా.. 22 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్​మెన్​ ఆకట్టుకోలేకపోయారు. సన్​రైజర్స్​ బౌలర్ల ధాటికి ధీటుగా నిలబడిన షారుక్​​ ఖాన్(22).. ఖలీల్​ అహ్మద్​ బౌలింగ్​లో వెనుదిరిగాడు.

ఎస్​ఆర్​హెచ్​ బౌలర్లలో ఖలీల్​ అహ్మద్​ 3 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును దెబ్బతీయగా, అభిషేక్​ శర్మ-2 వికెట్లతో రాణించాడు. మిగిలిన బౌలర్లలో భువనేశ్వర్​ కుమార్​, సిద్ధార్థ్​ కౌల్​, రషీద్​ ఖాన్​ తలో వికెట్​ దక్కించుకున్నారు.

ఇదీ చదవండి: రోహిత్​తో అవేశ్​ ఫ్యాన్ బాయ్ మూమెంట్

Last Updated : Apr 21, 2021, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.