ETV Bharat / sports

మా ఆటగాళ్లు మరింత బాధ్యతగా ఆడుతున్నారు: ధోనీ - dhoni about ipl

ఈ ఐపీఎల్​లో తమ ఆటగాళ్లు మరింత బాధ్యతగా ఆడుతున్నారని అన్నాడు సీఎస్కే సారథి ధోనీ. వారి ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించాడు.

Dhoni
ధోనీ
author img

By

Published : Apr 29, 2021, 11:59 AM IST

తమ జట్టును చెన్నై సూపర్​ కింగ్స్​ సారథి ధోనీ ప్రశంసించాడు. ఈ సీజన్​లో తమ ఆటగాళ్లు మరింత బాధ్యతగా ఆడుతున్నారని అన్నాడు. సన్​రైజర్స్​ హైదరాబాద్​తో గురువారం జరిగిన మ్యాచ్​లో విజయం సాధించిన తర్వాత మహీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

"బ్యాటింగ్​ అదరగొట్టారు, అలా అని బౌలింగ్​ బాగోలేదని కాదు. దిల్లీలో తేమ లేకపోవడం, వికెట్​ చాలా బాగుండటం ఆశ్చర్యకరంగా ఉంది" అని ధోనీ అన్నాడు.

మీ ప్రదర్శనలో గత సీజన్​కు ఈ ఏడాదికి తేడా ఏంటి అని అడగగా.. "ముందుగా మాకు ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటున్నాం. గతేడాది ఐదు, ఆరు నెలలు క్రికెట్​ ఆడలేదు. క్వారంటైన్​లో ఉండటం ఇంకా అనేక కారణాలు వల్ల గత సీజన్​ కొంచెం కష్టంగా గడిచింది. ఏదేమైనప్పటికీ ఈ ఐపీఎల్​లో మా ఆటగాళ్లు మరింత బాధ్యతగా ఆడుతున్నారు. గత 8-10ఏళ్ల నుంచి మా జట్టు ఆటగాళ్లను మార్చలేదు. టీమ్​లో అవకాశం రాని ప్లేయర్స్​ను కూడా మెచ్చుకోవాలి. వారు నమ్మకం ఉంచి ఇంకా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు" అని మహీ చెప్పాడు. ఈ మ్యాచ్​లో సన్​రైజర్స్​పై సీఎస్కే 7 వికెట్ల తేడాతో గెలిచింది.

ఇదీ చూడండి.. కరోనాను జయించిన ధోనీ తల్లిదండ్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.