ETV Bharat / sports

టీ20ల్లో కేఎల్​ రాహుల్​@5000 రన్స్ - కేఎల్​ రాహుల్ టీ20 ఫార్మాట్​లో 5వేల పరుగులు

టీ20 ఫార్మాట్​లో పంజాబ్​ కింగ్స్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ 5వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన 12వ భారత బ్యాట్స్​మన్​గా కేఎల్​ రాహుల్​ నిలిచాడు.

KL Rahul
కేఎల్​ రాహుల్
author img

By

Published : Apr 21, 2021, 6:32 PM IST

Updated : Apr 21, 2021, 6:47 PM IST

పంజాబ్​ కింగ్స్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​.. బ్యాటింగ్​లో ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టీ20 ఫార్మాట్​లో 5వేల పరుగులు నమోదు చేశాడు. చెన్నై వేదికగా సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరుగుతోన్న మ్యాచ్​లో ఈ ఘనత సాధించాడు.

12వ భారత్​ క్రికెటర్​గా..
పొట్టి క్రికెట ఫార్మాట్​లో ఇప్పటివరకు 156 మ్యాచ్​లు ఆడిన కేఎల్​ రాహుల్​.. 5003 రన్స్​ చేశాడు. అందులో 4 సెంచరీలు, 41 అర్ధశతకాలున్నాయి. ఈ ఘనతను సాధించిన 12వ భారత క్రికెటర్​గా కేఎల్​ రాహుల్​ ఘనత వహించాడు. అయితే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్​మన్​గా టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ నిలిచాడు.
క్రిస్​ గేల్ తర్వాత అతితక్కువ సమయంలో 5 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న బ్యాట్స్​మన్​గా కేఎల్​ రాహుల్​ ఘనతకెక్కాడు. క్రిస్​ గేల్​.. 132 ఇన్నింగ్స్​లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. కేఎల్​ రాహుల్​ 143వ ఇన్నింగ్స్​లో ఈ రికార్డు నెలకొల్పాడు.

కేఎల్​ రాహుల్​.. ఐపీఎల్​ కెరీర్​లో పంజాబ్​ కింగ్స్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఈ టోర్నీలో 44.57 సగటుతో 2,808 పరుగులను నమోదు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 23 అర్ధశతకాలున్నాయి.

ఇవీ చదవండి: టీ20 ర్యాంకింగ్స్​: రెండో ర్యాంకులో బాబర్​.. కోహ్లీ@5

'టెస్టు క్రికెట్​ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది'

Last Updated : Apr 21, 2021, 6:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.