ETV Bharat / sports

ఐపీఎల్ ధనాధన్.. రచ్చ రచ్చకు వేళాయే!

నరాలు తెగే ఉత్కంఠ, అంతులేని ఆనందాన్నిచ్చే ఐపీఎల్​కు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో 14వ సీజన్​ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లీగ్​ గురించి కొన్ని విశేషాలు మీకోసం.

IPL-2021 OVERALL
ఐపీఎల్ ధనాధన్.. రచ్చ రచ్చకు వేళాయే!
author img

By

Published : Apr 8, 2021, 9:03 PM IST

ప్రపంచంలోనే అత్యంత ప్రేక్షదారణ పొందిన లీగ్‌లలో ఒకటైన ఐపీఎల్.. 5 నెలల వ్యవధిలోనే మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. యావత్ దేశాన్ని కరోనా మహమ్మారి రెండో దశ కమ్మేస్తున్న వేళ.. ప్రేక్షకులు లేకుండానే లీగ్ నిర్వహించనున్నారు. ఈ సీజన్​ను మొత్తం 6 నగరాల్లో జరపనున్నారు. తొలి మ్యాచ్​లో చెన్నై వేదికగా బెంగళూరు- ముంబయి జట్లు తలపడనున్నాయి.

cricket ipl
క్రికెట్ మైదానం

కొన్ని గంటల్లో ఈ సంరంభానికి తెరలేవనుండగా.. గత సీజన్​లానే ఈసారి కూడా పూర్తి బయోబబుల్ వాతావరణంలో నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా పంజా విసురుతున్నప్పటికీ.. అన్ని జాగ్రత్తలూ తీసుకొని లీగ్‌ జరిపేందుకు సిద్ధమైంది.

డిపెండిగ్​ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌శర్మపైనే ఈసారి అందరి దృష్టి ఉంది. మరోసారి కప్పు కొడతాడా అని అందరూ ఆలోచిస్తున్నారు. టీమ్​ఇండియా సారథిగా ఎన్నో విజయాలు అందించిన కోహ్లీ ఈసారైనా బెంగళూరును విజేతగా నిలపాలని అభిమానులు కోరుకుంటున్నారు. కొన్ని నెలల నుంచి ఆటకు దూరంగా ఉన్న ధోనీని, మైదానంలో చూసేందుకు క్రికెట్ ప్రేమికులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

IPL-2021 OVERALL
ధోనీ ఐపీఎల్

వీటితో పాటే యువ క్రికెటర్లు చేసే బ్యాటింగ్ విన్యాసాలు, ఫ్లడ్‌లైట్లపై నుంచి వెళ్లే భారీ సిక్సులు, చివరి ఓవర్లలో నరాలు తెగే ఉత్కంఠ భరిత క్షణాలను ఈ సారి కూడా ఇళ్లలో టీవీల్లో నుంచే చూడాలి. ఇప్పటికే కొందరు క్రికెటర్లకు, జట్టు సిబ్బందికి కొవిడ్ పాజిటివ్ తేలినప్పటికీ కఠినమైన బయో బబుల్ నిబంధనలతో టోర్నీని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదే భారత్‌లో టీ20 ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్​లో భారత క్రికెటర్ల ప్రదర్శనపైనా అందరూ దృష్టి సారిస్తున్నారు.

IPL-2021 OVERALL
ఐపీఎల్ కప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.