ఐపీఎల్ 2021(IPl 2021 News)లో భాగంగా ముంబయి ఇండియన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 135 పరుగులు చేసింది. మర్క్రమ్ (42), హుడా (28) ఆకట్టుకున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు మొదట శుభారంభాన్నిచ్చారు ఓపెనర్లు రాహుల్, మన్దీప్ సింగ్. వీరిద్దరూ తొలి వికెట్‌కు 36 పరగులు జోడించారు. అనంతరం రాహుల్ (21)ను పొలార్డ్ పెవిలియన్ పంపగా, మన్దీప్ సింగ్ (15)ను ఔట్ చేశాడు కృనాల్ పాండ్యా. తర్వాత వచ్చిన గేల్ (1), పూరన్ (2) దారుణంగా విఫలమయ్యారు. దీంతో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్నారు మర్క్రమ్, దీపక్ హుడా. ముంబయి బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఐదో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్నారు. వీరి ఇన్నింగ్స్ సాఫీగా సాగుతోన్న క్రమంలో మర్క్రమ్ (42)ను క్లీన్ బౌల్డ్ చేశాడు రాహుల్ చాహర్. అనంతరం హుడా 28 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత ముంబయి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల నిర్ణీత ఓవర్లలో 135 పరుగులకు పరిమితమైంది పంజాబ్.